»   » తమ తండ్రుల గురించి.. మహేష్,రామ్ చరణ్, ప్రభాస్... (ఫోటో ఫీచర్)

తమ తండ్రుల గురించి.. మహేష్,రామ్ చరణ్, ప్రభాస్... (ఫోటో ఫీచర్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ఈ ఆదివారం పితృ దినోత్సవం సందర్భంగా మన స్టార్ హీరోలు, హీరోయిన్స్ తమ తండ్రుల గురించి,వారికి తాము ఇచ్చే ప్రాముఖ్యత గురించి గుర్తు చేసుకున్నారు.

'మాతృదేవోభవ... పితృదేవోభవ...' అంటూ తల్లి తరవాత స్థానం ఇచ్చినా నొచ్చుకోడు నాన్న అంటూ తమ మనస్సులో భావాలను చెప్తున్నారు. తమ తండ్రి చెప్పిన సూచనలను,సలహాలను తమ జీవితాంతం గుర్తుంచుకుంటామని చెప్తున్నారు.

అలాగే తండ్రి పాత్ర జీవితంలో చాలా గొప్పదని, ఆకలేస్తే పాలు పడతాడు. ఏడిస్తే జోల పాడతాడు. భయమేస్తే గుండెలకు హత్తుకుంటాడు. అచ్చం అమ్మలా. బుడిబుడి అడుగులు వేయడం నుంచి జీవిత లక్ష్యానికి చేరుకునేవరకూ వెన్నంటే ఉంటాడు చెప్తున్నారు.


తమ నాన్న గురించి హీరోలూ హీరోయిన్లూ చెప్పే విశేషాలు..స్లైడ్ షోలో...

నాన్నతో గడిపిన చిన్ననాటి రోజులంటే నాకెంతో ఇష్టం. ఈమధ్య నాన్నేమో రాజకీయాల్లో నేనేమో సినిమాల్లో బిజీగా ఉండటంతో అప్పటిలా ఎక్కువ సమయం కలిసి గడపలేకపోతున్నాం. అయితే ఎక్కడున్నా ఎంత బిజీగా ఉన్నా ఫోన్‌లో మాత్రం టచ్‌లోనే ఉంటాను. నేను సినిమాల్లోకి వస్తానన్నప్పుడు 'నేను సలహాలు మాత్రమే ఇవ్వగలను. నటుడుగా నిన్ను నువ్వే నిరూపించుకోవాలి' అన్నారు. ఇప్పటికీ ఆ విషయం గుర్తుపెట్టుకునే ముందుకు వెళుతున్నా. నా ప్రతి సినిమా విషయంలోనూ నాన్న సలహా తప్పక తీసుకుంటాను. ఎందుకంటే నటనలో ఆయన అనుభవాలే నాకు పాఠాలు అన్నారు.

మా నాన్నగారితో మాట్లాడుతుంటే సమయమే తెలీదు. జోక్స్‌ బాగా వేస్తారు. నా సినిమాలకు మొదటి, ఉత్తమ విమర్శకులు ఆయనే. అలాగే
సూపర్‌స్టార్‌ కృష్ణగారబ్బాయి... జన్మనే కాదు, పుడుతూనే గుర్తింపునీ ఇచ్చారు. ఇంతకన్నా ఏ తండ్రయినా ఏమివ్వగలడు? వేసవి సెలవులు ఇచ్చిన ప్రతీసారి నన్ను వూటీ తీసుకెళ్లేవారు. పిల్లలకు స్వేచ్ఛనివ్వడం ఎంత ముఖ్యమో దానివల్ల వాళ్ల జీవితం దారి తప్పకుండా చూడటం కూడా అంతే ముఖ్యం. బాలనటుడుగా దూసుకుపోతున్న నాకు మధ్యలో 'ఇక సినిమాలు వద్దు, బుద్ధిగా చదువుకో' అంటూ బ్రేక్‌ వేశారు. నేను ఎదురుచెప్పలేదు. డిగ్రీ చేసేటప్పుడు మళ్లీ సినిమాల ఆలోచన వచ్చింది. ఆ విషయం అప్పుడు నాన్నగారికి చెప్పాను. వెంటనే సరేనన్నారు. అలా నా విషయంలో సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నారు.

నేనంటే మా నాన్నకి చాలా ఇష్టం. మా నాన్నలో బాగా నచ్చింది ఆయన సేవాగుణం. పుట్టి పెరిగిన అవనిగడ్డలో పాతికేళ్ల క్రితం స్కూలు కట్టించారు. ఆ స్కూలు ద్వారా ఏటా ఐదొందల మంది అమ్మాయిలకు ఉచితంగా చదువు చెప్పిస్తున్నారు. నేను కూడా ఆయనలానే సేవ చేయాలనుకుంటున్నా. ఐ లవ్‌ యూ డాడ్‌. మానాన్న ప్రసాదే నా హీరో. ఎప్పటికీ ఆయన కొడుకుగానే పుట్టాలని దేవుణ్ని కోరుకుంటాను.


మా నాన్న ఒకటే విషయం చెప్పారు. ముందు ఎవరైనా కథ చెబితే శ్రద్ధగా విను. పూర్తిగా విన్నాక దానిగురించి నీ అభిప్రాయాన్ని నిర్మొహమాటంగా చెప్పు. అందులో మార్పుచేర్పులేమయినా ఉండాలనుకున్నా కథలో నీ పాత్రకు సరైన ప్రాధాన్యం లేదనుకున్నా ఆ విషయాలన్నీ ముందుగానే చర్చించు. సినిమా ఒప్పుకున్న తరవాత మాత్రం అందులో నువ్వు కలగజేసుకోవద్దు. దర్శకుడు దూకమంటే దూకు... పడమంటే పడు' అన్నారు. ఇప్పటికీ నాకు ఆ మాటే వేదవాక్కు. అలాగే మా నాన్న నన్ను హీరో చేయాలని ఎప్పుడూ అనుకోలేదు. నిర్మాణరంగం చూసుకోమన్నారు. కానీ నాకేమో నటన ఇష్టం. 'నటుణ్ణి అవుతా నాన్నా' అని అడిగా. వద్దన్నారు. ప్రొడక్షన్‌ చూసుకుంటూనే మళ్లీ అడిగాను. ఈసారిఏ కాదనలేకపోయారు. దగ్గరుండి మరీ శిక్షణ ఇప్పించారు.

నిజానికి మా నాన్న ఎవరితోనయినా చాలా తక్కువ మాట్లాడేవారు. కానీ అందులోనే చాలా విషయం ఉండేది. ఆయన ప్రభావం నామీద చాలా ఎక్కువ. నా బాడీ లాంగ్వేజ్‌, మాటతీరు నాన్నలానే ఉంటాయని అంతా అంటుంటారు. అలా అంటుంటే నాకు చాలా గర్వంగా ఉంటుంది. నాన్నంటే చాలా ఇష్టం. కానీ ఆయనతో చాలా తక్కువ మాట్లాడేవాణ్ని. ఓ ఫాదర్స్‌డే రోజున నేను ఆయన పక్కన కూర్చుని చదువుకుంటున్నాను. ఆయన నన్ను పిలిచి ఫాదర్స్‌ డే గురించి చెప్పమన్నారు. 'అతి తక్కువ మాటలతో నన్ను ఎక్కువగా అర్థం చేసుకున్న వ్యక్తి మా నాన్న' అని ఠక్కున అనేశాను. అదేదో ఆలోచించి చెప్పింది కాదు. అలా ఎలా చెప్పానో నాకే తెలీదు. బహుశా నాన్న గురించి నా మనసులోని మాట అలా వచ్చేసి ఉంటుంది. ఆయన మాత్రం వెంటనే నన్ను కౌగిలించుకుని కంటనీరు పెట్టేశారు. ఫాదర్స్‌ డే అనగానే నాకు గుర్తొచ్చే సంఘటన ఇదే.


ఒకసారి నేనూ, చెల్లి కలిసి నాన్న పుట్టినరోజుకి యాభైమంది బంధువుల్ని హోటల్‌కి పిలిపించాం. నాన్నకు చెప్పకుండా అక్కడికి తీసుకెళ్లి చీకట్లో కేక్‌ కట్‌ చేయించాం. లైట్‌ వేయగానే మా బంధువులంతా 'హ్యాపీ బర్త్‌ డే' అంటూ అరిచి గోల చేశారు. అంతమంది బంధువుల సమక్షంలో పుట్టినరోజు చేసినందుకు చాలా సంతోషించారు. కొడుగ్గా ఆయనకి జీవితాంతం అలాంటి ఆనందాన్నే ఇవ్వాలని ఆశపడుతున్నా.

మా నాన్న సంతోష్‌ భాటియా. నాకేమో చిన్నప్పట్నుంచీ సినిమాలంటే పిచ్చి. నాన్నతో చాలా క్లోజ్‌గా ఉన్నా 'సినిమాల్లోకి వెళతా నాన్నా' అని చెప్పడానికి మాత్రం చాలా భయపడ్డా. నా అవసరాలన్నీ ముందే గమనించి అన్నీ అడక్కుండానే ఇచ్చారు. అలాంటిది సినిమాల్లోకి వెళ్లడం ఇష్టం లేదంటే ఇద్దరం నొచ్చుకోవాల్సి వస్తుందని చెప్పలేకపోయా. ఒక రోజు ధైర్యం చేసి చెప్పేశా. 'నీ మీద నీకు నమ్మకం ఉంటే తప్పకుండా వెళ్లు. కానీ ఎప్పుడూ మంచిదారిలోనే నడవాలి' అన్నారు.

నాన్న దీప్‌ సింగ్‌. మంచి వాస్తు పండితులు. జ్యోతిషశాస్త్రం చదువుకున్నారు. ఆధ్యాత్మిక గంథ్రాలంటే ఆసక్తి ఎక్కువ. నేను నటనలో రాణిస్తానని ముందే చెప్పారు. ఒకరకంగా నా కెరీర్‌ను ప్రణాళికాబద్ధంగా తీర్చిదిద్దింది ఆయనే. షూటింగులకు వెళ్లినప్పుడు తోడుగా వస్తుంటారు. నాన్న పక్కన ఉంటే ఎంతో ధైర్యంగా ఉంటుంది. కొంతమంది నాన్నల్లా ఎప్పుడూ ఎలాంటి ఆంక్షలూ పెట్టరు. నామీద పూర్తి నమ్మకం ఉంది. కాకపోతే ఎప్పుడూ ఒకే విషయం చెబుతుంటారు... 'ఎదుటివారి మనసు నొప్పించకుండా ఉండమ'ని. ఆ విషయం నేను బాగా గుర్తుపెట్టుకున్నా. సాధ్యమైనంతవరకూ అలా ఉండేందుకే ప్రయత్నిస్తా. ఆయనలోని ఆ మంచితనమే నాకు స్ఫూర్తి.

English summary

 Our Tollywood Hero's celebrating Fathers day and remembers their releationship with their father.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu