»   » మూడు ప్రాంతాలకు అతీతంగా ఓయ్ డైరెక్టర్స్ ‘శూన్యం’

మూడు ప్రాంతాలకు అతీతంగా ఓయ్ డైరెక్టర్స్ ‘శూన్యం’

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఓయ్ చిత్రంలో హీరోగా నటించిన సిద్దార్థ, దర్శకుడుగా పనిచేసిన ఆనంద్ రంగ ఇద్దరూ మణిరత్నం శిష్యులట. బాంబే చిత్ర నిర్మాణ సమయంలో ఇద్దరూ మణిరత్నం వద్ద సహ దర్శకులుగా పనిచేశారట. ఆనంద్ దర్శకత్వ శాఖలో అలానే కొనసాగగా సిద్దార్థ మాత్రం నటనవైపు మొగ్గు చూపాడు. తనకంటూ ఓ ఇమేజ్‌ను సృష్టించుకున్నాడు. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఓయ్ యంగ్ డైరెక్టర్ ఆనంద్ రంగ తదుపరి చిత్రానికి 'శూన్యం" అనే టైటిల్ ను ఖరార్ చేశారు.

'శూన్యం" సినిమాకి గాను స్క్రిప్ట్ వర్క్ ముంగించుకొని మరి కొద్ది రోజుల్లో సెట్స్ మీదకు వెళ్ళనుంది. ఈ చిత్రం కథాంశ పరంగా ముగ్గరు యువకుల మద్య నడుస్తుందని, ఒక వ్యక్తి ఆంద్ర నుండి వచ్చిన హిందూ అయితే మరొక వ్వక్తి రాయలసీమన నుండి వచ్చిన క్రిష్టియన్, మరి మూడో వ్యక్తి తెలంగాణ నుండి వచ్చి ముస్లీం. ఇలా మూడు ఇతర ప్రాంతాల నుండి వచ్చిన వ్యక్తుల మధ్య కథ సారాంశమే 'శూన్యం" అని దర్శకుడు అంటున్నారు. ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుందని నాకు పూర్తి విశ్వాసం ఉంది. మీకెవరికీ ఈ సినిమా మూల కథ తెలియదు కాబట్టి, మీకు కొంచెం ఆశ్చర్యంగా ఉండొచ్చు టైటిల్ చూసిన తరువాత. అయితే ఈ టైటిల్ చూడటానికి నెగటీవ్ గా ఉన్నా ఆనంద్ రంగ డైరక్షన్ లో ఎలా పాజిటివ్ అవుతుందో, ఇతర వివరాకోసం మరికొద్ది రోజులు వేచిచూడాల్సిందే.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu