»   » వెంకటేష్ గొంతులో రుమాలు పెట్టుకుని యాక్ట్ చేశారు

వెంకటేష్ గొంతులో రుమాలు పెట్టుకుని యాక్ట్ చేశారు

Posted By:
Subscribe to Filmibeat Telugu

వెంకటేష్ ఈ చిత్రంలోని రాజు పాత్రకు, వృద్ధుడి పాత్రకు చాలా హోమ్‌వర్క్ చేశారు. ముఖ్యంగా వృద్ధుడి పాత్రకు గొంతులో రుమాలు పెట్టుకుని యాక్ట్ చేశారు అంటూ చెప్పుకొచ్చారు దర్శకుడు పి.వాసు. వెంకటేష్ హీరోగా పి.వాసు దర్శకత్వంలో బెల్లంకొండ సురేష్ నిర్మించిన నాగవల్లి ఈ గురువారం విడుదలైంది. ఈ చిత్రం చూసిన ప్రేక్షకులకు థ్యాంక్స్ గివింగ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. శనివారం హైదరాబాద్‌లో జరిగిన ఈ సమావేశంలో పి.వాసు పై విధంగా స్పందించారు.

ఆ తర్వాత వెంకటేష్ మాట్లాడుతూ...నాగవల్లి సినిమాని చూసి, వెంకీ చాలా బాగా చేశావ్. ఫెంటాస్టిక్ జాబ్ అని రజనీకాంత్ న్నారు. అంతకుమించిన బెస్ట్ కాంప్లిమెంట్స్ ఏం ఉంటాయి అంటున్నారు వెంకటేష్. ఈ చిత్రాన్ని వాసుగారు ఎంతో పకడ్బందీగా తీశారు. మా అందరి కృషికి తగిన ప్రతిఫలాన్నిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు అన్నారు.

అలాగే నిర్మాత బెల్లంకొండ సురేష్ ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ... ఈ సినిమాని రజనీ చెన్నయ్‌లో చూసి, సినిమా అద్భుతంగా ఉంది. నిర్మాణం విలువలు బాగున్నాయి అని అభినందించారు. ఆయన చేయాల్సిన సినిమా వేరే హీరో చేసినప్పటికీ రజనీ ఫోన్ చేసి అభినందించడం ఆయన సంస్కారానికి నిదర్శనం అన్నారు. అలాగే చంద్రముఖి కి సీక్వెల్ అయిన ఈ చిత్రానికి భారీ ఓపెనింగ్స్ వచ్చాయని అన్నారు.

అలాగే ఇప్పటివరకు సాధించిన వసూళ్ల ప్రకారం నైజాంలో టాప్ 5లో ఓ సినిమాగా నిలిచింది నాగవల్లి . విడుదలైన అన్ని థియేటర్లలో భారీ వసూళ్లు వస్తున్నాయి అన్నారు. సమావేశంలో పాల్గొన్న రిచా, కమలిని, శ్రద్ధా.. ఇంతటి ప్రతిష్టాత్మకమైన చిత్రంలో నటించడంపట్ల తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu