శేఖర్ కపూర్,హృతిక్ రోషన్ 'పానీ'పూర్తి వివరాలు
ఈ విషయమై శేఖర్ కపూర్ ట్వీట్ చేస్తూ... "నేను పదిహేను సంవత్సరాల క్రితం పానీ కథ రాస్తున్నప్పుడు ఇంత పెద్ద ది అవుతుందని ఊహించలేదు.రిచర్డ్ అటెన్ బరో తాను గాంధీ చిత్రం చేయటానికి ఇరవై సంవత్సరాలు పట్టింటదని చెప్పారు. ప్రతీ దర్శకుడు కు ఇలాంటిది ఎదురౌతుందనుకుంటాn," అన్నారు.
ఇక శేఖర్ కపూర్ ఈ చిత్రం కోసం తొలుత వివేక్ ఒబెరాయ్, రణ్‌బీర్ కపూర్‌లతో చర్చించినట్లు తెలిసింది. 'పానీ'ని యశ్‌రాజ్ ఫిలిమ్స్‌పై ఆదిత్య చోప్రా దాదాపు రూ.150 కోట్ల బడ్జెట్‌తో నిర్మించబోతున్నట్లు సమాచారం. వచ్చే ఏడాది చిత్రీకరణ ప్రారంభమవుతుంది. ప్రస్తుతం హృతిక్ రోషన్ 'క్రిష్-3'లో నటిస్తున్నారు. యశ్‌రాజ్ సంస్థ 'ధూమ్-3' నిర్మాణ పనుల్లో తలమునకలై ఉంది. ఈ రెండూ పూర్తయిన తరవాతే శేఖర్ సినిమా ఉంటుంది.
'పానీ' కథ - భవిష్యత్తులో నీటి కోసం జరిగే యుద్ధాల చుట్టూ తిరుగుతుందని తెలిసింది. అయితే సున్నితమైన ప్రేమ కథ కూడా అంతర్లీనంగా కొనసాగుతుందని తెలిసింది. ఎ.ఆర్.రెహమాన్ సంగీతం అందించబోతున్నారు. శేఖర్ కపూర్ చిత్రాలు మాసూమ్, బాండిట్ క్వీన్, మిస్టర్ ఇండియా,ఎలిజిబుత్ వంటివి సినీ చరిత్రలో నిలిచిపోయాయి.


Click it and Unblock the Notifications












