For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  'పద్మావత్'పై మొట్టమొదటి రివ్యూ: మంత్రముగ్ధుల్ని చేసే సినిమా..

  |
  'పద్మావత్'పై మొట్టమొదటి రివ్యూ..!

  వివాదాలన్నింటి నుంచి గట్టెక్కి ఎట్టకేలకు ఈ నెల 25న విడుదలకు సిద్దమైంది 'పద్మావత్' చిత్రం. అయినా ఎక్కడో ఏదో అనుమానం.. చివరి నిమిషంలో మళ్లీ ఎవరైనా అడ్డుపడుతారేమోనని!. సెన్సార్ నిబంధనలకు అనుగుణంగా సినిమాలో చాలా సీన్లకు కత్తెర వేసినా.. కర్ణిసేన ఆగ్రహం మాత్రం చల్లారకపోవడంతో.. సినిమా విడుదల రోజు ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది.

  వివాదాల సంగతెలా ఉన్నా.. సినిమాకు సంబంధించి అప్పుడే రివ్యూ కూడా బయటకు రావడం విశేషం. ఇన్ని వివాదాలను తట్టుకుని విడుదలకు సిద్దమైన ఈ సినిమా అంచనాలను అందుకుందా?.. భన్సాలీ మరోసారి తన మార్క్ చూపించారా?.. మొత్తంగా సినిమా ఎలా ఉంది? అనే ప్రశ్నలకు సమాధానంగా బాలీవుడ్ ఫిలిం క్రిటిక్ ఉమైర్ సంధు సంధించిన రివ్యూ ఇదీ..

  'పద్మావతి'కి సెన్సార్ బిగ్ షాక్: క్లియరెన్స్ ఇచ్చినట్లే ఇచ్చి!..

  చరిత్రలోకి తీసుకెళ్లే సినిమా:

  ఒక ప్రేమ కథా.. అందులో చోటు చేసుకునే సంఘర్షణ, నాటకీయ పరిణామాలు, భీకర యుద్ద సన్నివేశాలతో కూడిన ఈ చిత్రం ప్రేక్షకులను అత్యంతగా ఆకట్టుకోవడమే కాకుండా.. చరిత్రలోకి తీసుకెళ్లి కూర్చోబెడుతుంది. కేవలం పుస్తకాల్లో మాత్రమే చదువుకున్న కథను కళ్లముందు సజీవంగా ఆవిష్కరిస్తుంది.

  సహజత్వం ఉట్టిపడే సన్నివేశాలు..:

  సహజత్వం ఉట్టిపడే సన్నివేశాలు..:

  తెరపై భన్సాలీ కథను నడిపించిన తీరు ప్రతీ ఒక్కరిని విశేషంగా ఆకట్టుకుంటుంది. ఆన్‌స్క్రీన్ ఆయన పాత్రలను పరిచయం చేసిన విధానం గానీ.. అలాగే వాటి చుట్టు అల్లబడిన సన్నివేశాలు గానీ అత్యంత సహజంగా అనిపిస్తాయి. సీట్లో కూర్చున్న ఔత్సాహిక ప్రేక్షకుడిని 'పద్మావత్' కట్టిపడేయడం ఖాయం.

  భన్సాలీ నెరేషన్ సూపర్బ్..:

  భన్సాలీ నెరేషన్ సూపర్బ్..:

  సినిమా చూస్తుంటే.. హాలీవుడ్ క్లాసికల్ చిత్రాల నుంచి భన్సాలీ స్ఫూర్తి పొందినట్లుగా స్పష్టమవుతోంది. అయితే 'పద్మావత్' కథను నెరేట్ చేయడంలో భన్సాలీ కనబర్చిన నేర్పు అధ్భుతం. పద్మావత్ సినిమా స్థాయిని పెంచడంలో భన్సాలీ కనబర్చిన ఈ నేర్పు స్పష్టంగా కనిపిస్తుంది.

  పాత్రల ఆహార్యం అద్భుతంగా..:

  పాత్రల ఆహార్యం అద్భుతంగా..:

  నిర్మాణ విలువల పరంగా ఎక్కడా రాజీపడకుండా సినిమా తెరకెక్కించారనేది స్పష్టమవుతోంది. అప్పటి చారిత్రాక నేపథ్యాన్ని కళ్ల నిండుగా ఆవిష్కరించడంలో భన్సాలీ&చిత్రయూనిట్ పెట్టిన ఎఫర్ట్ ప్రేక్షకుడికి అర్థమవుతుంది. పాత్రల ఆహార్యాన్ని భన్సాలీ తీర్చిదిద్దిన విధానం తెరపై మనోహరంగా కనిపిస్తుందనడంలో సందేహం లేదు.

   కథకు తగ్గ మ్యూజిక్:

  కథకు తగ్గ మ్యూజిక్:

  చరిత్రకు సంబంధించిన కథను దానికి తగ్గ మ్యూజిక్ తో భన్సాలీ బాగా డీల్ చేయగలిగాడు. తెరపై పాటల్ని(భన్సాలీ కంపోజ్ చేసిన సాంగ్స్ కూడా) చూస్తుంటే ప్రేక్షకుడు మైమరిచిపోతానడంలో అతిశయోక్తి లేదు. రాజస్థానీ కల్చర్‌ను ప్రతిబింబించేలా చిత్రీకరించిన 'గూమర్' సాంగ్ ఔట్ స్టాండింగ్. నేపథ్య సంగీతంతో పాటు సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ అన్నీ అద్భుతంగా కుదిరాయి.

  రణ్‌వీర్ సింగ్ అద్భుత నటన..:

  రణ్‌వీర్ సింగ్ అద్భుత నటన..:

  సినిమాలో నటీనటులందరిని పూర్తి స్థాయిలో వినియోగించుకోవడంలో భన్సాలీ సక్సెస్ అయ్యాడు. రణ్‌వీర్ సింగ్ కనబరిచిన నటన అగ్రస్థానంలో ఉంటుందని చెప్పవచ్చు. ఫస్ట్ ఫ్రేమ్ నుంచి చివరి వరకు.. భావోద్వేగ సన్నివేశాల్లోనూ రణ్ వీర్ తన నటనతో కట్టిపడేశాడు. పాత్రలో అతను జీవించిన తీరు ప్రతీ ప్రేక్షకుడిని ఆకట్టుకుంటుంది. ఇప్పటిదాకా రణ్ వీర్ చేసిన అన్ని పాత్రల కంటే ఈ పాత్ర ది బెస్ట్ అని చెప్పవచ్చు.

   మంత్రముగ్దుల్ని చేసే 'దీపికా'..:

  మంత్రముగ్దుల్ని చేసే 'దీపికా'..:

  పద్మావతి పాత్రలో దీపికా పదుకొణే ప్రేక్షకులను మంత్ర ముగ్దులను చేసింది. తన కెరీర్ లోనే దీపిక అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన సినిమా 'పద్మావత్' అని చెప్పవచ్చు. నటిగా దీపికా సామర్థ్యమేంటో కొన్ని సన్నివేశాల్లో స్పష్టంగా కనిపిస్తుంది.

   ఆసాంతం ఆకట్టుకునే 'షాహిద్..':

  ఆసాంతం ఆకట్టుకునే 'షాహిద్..':

  సినిమా ఆసాంతం షాహిద్ కపూర్ తనదైన నటనతో కట్టిపడేస్తాడు. షాహిద్ పాత్రలో ఒదిగిపోయిన తీరు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. అలాగే దీపికాతో రొమాన్స్ సన్నివేశాల్లోనూ షాహిద్ నటన అద్భుతంగా ఉంటుంది. సినిమాలో సహాయ పాత్ర పోషించిన అదితిరావ్ పాత్ర ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

  ఫైనల్‌ వర్డ్..:

  'పద్మావత్' ప్రతీ ఒక్కరూ తప్పక చూడాల్సిన ఓ సినీ రత్నం. అద్భుతమైన నటన, మంత్రముగ్దుల్ని చేసే డైరెక్షన్, శక్తివంతమైన స్క్రీన్ ప్లే డైలాగ్స్, మెలోడి సౌండ్ ట్రాక్, అత్యుద్భతమైన సెట్టింగ్స్.. మొత్తంగా అన్నీ కలిగలిపిన చిత్రం 'పద్మావత్'.

  English summary
  Padmaavat is Bhansali’s most ambitious project to date. The love story, the conflict, the dramatic altercations, the battle sequences and of course, the ostentatious setting… It is an enthralling period film that transports you to an era you had only read about in the history books.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more