»   »  పద్మప్రియకు మలయాళ సినిమా అండ

పద్మప్రియకు మలయాళ సినిమా అండ

Posted By:
Subscribe to Filmibeat Telugu

పద్మప్రియ గొడవ కేరళకు పాకింది. మలయాళ ఫిల్మ్ ఆర్టిస్ట్ స్ అసోసియేషన్ పద్మప్రియకు ఫుల్ సపోర్ట్ ను ప్రకటించారు. గోపిక, భావన, నవ్యా నాయర్, కార్తీక, గీతు మోహన్ దాస్ తదితరులు పద్మప్రియకు సంఘీభావాన్ని ప్రకిటించారు. పద్మప్రియను కొట్టినట్టుగా నన్నెవరైనా కొడితే ఆన్ ది స్పాట్ డాడీ వాడిని చంపేసేవాడు..తమిళంలో 9 సినిమాలలో నటించాను కానీ నాకిలాంటి అనుభవం ఎదురుకాలేద...ని గోపిక గరం అవుతోంది. తమిళంలోనూ నటించే భావన కూడా ఇలాంటి స్పందనను వ్యక్తపరిచింది...ఇది దురదృష్ట సంఘటన..సహించరాని సంఘటన. దర్శకుడైనంత మాత్రనా కొట్టొచ్చనుకోవడం పొరపాటు..కొట్టడం వలన అనుకున్న నటనను రాబట్టవచ్చనుకోవడం తప్పు. మలయాళ సినీ పరిశ్రమలో ఇలాంటి లేవు సంతోషం..అంటోంది. కార్తీక, నవ్యా నాయర్, గీతు మోహన్ దాస్ లు కూడా సామి ప్రవర్తనను తీవ్రంగా ఖండించారు. మలయాళం ఫిల్మ్ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు ఈ విషయమై తీవ్రంగా స్పందిస్తూ ఇలాంటి జరగకూడదన్నారు.

Read more about: padmapriya malayalam films
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X