»   »  దీపిక పదుకోన్ ‘పద్మావతి’ ఫస్ట్ లుక్ అదుర్స్

దీపిక పదుకోన్ ‘పద్మావతి’ ఫస్ట్ లుక్ అదుర్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu
Ranveer Singh To Romance A Guy In Padmavati ఒక అబ్బాయితో రణవీర్ రొమాన్స్స్..

బాలీవుడ్ నటి దీపిక పదుకోన్ ప్రధాన పాత్రలో సంజయ్‌ లీలా భన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్‌ మూవీ 'పద్మావతి'. పీరియడ్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ దసరా నవరాత్రి ఉత్సవాల ప్రారంభం సందర్భంగా విడుదల చేశారు.

రాణి పద్మవాతి జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. దీపిక పదుకోన్ 'పద్మావతి' లుక్ ఎంతో అద్భుతంగా ఉందంటూ ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ చిత్రంలో ఇంకా రణ్‌వీర్‌ సింగ్‌, షాహిద్‌ కపూర్‌ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

పద్మావతి

పద్మావతి

రాజస్థాన్‌లోని చిత్తోడ్ కోటను ఏలిన రాణి పద్మావతి లైఫ్ హిస్టరీ బేస్ చేసుకుని దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

షాహిద్ కపూర్

షాహిద్ కపూర్

బాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్ ఈ చిత్రంలో రావత్ రతన్ సింగ్ పాత్రలో నటిస్తున్నారు. ఈ పాత్ర పద్మావతి భర్త పాత్ర అని తెలుస్తోంది.

రణవీర్ సింగ్

రణవీర్ సింగ్

చిత్తోడ్ కోటపై దండెత్తిన మహ్మదీయ రాజు అల్లా ఉద్దీన్ ఖిల్జీ పాత్రలో రణవీర్ సింగ్ నటిస్తున్నారు.

పీరియడ్ డ్రామా, లవ్ స్టోరీ

పీరియడ్ డ్రామా, లవ్ స్టోరీ

పీరియడ్ డ్రామాకు లవ్ స్టోరీ జోడించి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. పద్మావతి-అల్లా ఉద్దీన్ ఖిల్జీ ప్రేమాయణం కోణంలో సినిమా ఉంటుందనే వార్తలు రావడంతో రాజ్ పుత్ వంశీయులు చిత్ర యూనిట్ మీద దాడి చేసిన సంగతి తెలిసిందే.

వివాదాలు

వివాదాలు

పద్మావతి రాణి చరిత్రను వక్రీకరిస్తే సహించేది లేదని ఇప్పటికే కొన్ని సంఘాలు హెచ్చరించాయి. వివాదాస్పద చిత్రంగా తెరకెక్కుతున్న ‘పద్మావతి' డిసెంబర్ 1న విడుదలకు సిద్ధమవుతోంది.

English summary
Padmavati mobie first look released. Padmavati is an upcoming Indian period drama film directed by Sanjay Leela Bhansali, jointly produced by Bhansali and Viacom 18 Motion Pictures. The film features Deepika Padukone in the title role as Rani Padmini, alongside Ranveer Singh, Shahid Kapoor, Jim Sarbh and Aditi Rao Hydari.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu