»   » బూతు బూతు అన్నాడు... మరి ఇపుడు ఆయన చేస్తున్నదేంటి?

బూతు బూతు అన్నాడు... మరి ఇపుడు ఆయన చేస్తున్నదేంటి?

Posted By:
Subscribe to Filmibeat Telugu

కేంద్ర సెన్సార్ బోర్డ్ చైర్మన్ హోదాలో ఉన్న సమయంలో పహ్లాజ్ నిహలానీ వ్యవహారం బాలీవుడ్లో వివాదాస్పదం అయింది. ఆయన తీరుతో చాలా మంది ఫిల్మ్ మేకర్స్ బెంబేలెత్తిపోయారు. ముద్దు సీన్లు, శృంగార సన్నివేశాలు ఉంటే... ఎథిక్స్, కల్చర్ అంటూ నిర్దాక్షిణ్యంగా ఆ సీన్లకు కత్తెర పెట్టేవాడు నిహలానీ.

జేమ్స్ బాంబ్ సినిమా ఇండియాలో రిలీజైనపుడు కూడా అందులో ముద్దు సీన్లుకు కత్తెర పెట్టిన ఘనత ఆయనకే దక్కింది. నిహలానీ తీరుపై విమర్శలు, వివాదాలు చాలా ఉన్నాయి. ఆ కారణంగానే ఆయన్ను సెన్సార్ బోర్డ్ చీఫ్ పదవి నుండి తొలగించినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి.

అడల్ట్ సినిమాకు డిస్ట్రిబ్యూటర్‌గా

అడల్ట్ సినిమాకు డిస్ట్రిబ్యూటర్‌గా

సెన్సార్ బోర్డు చీఫ్‌గా ఉన్నపుడు బూతు బూతు అంటూ.... ఫిల్మ్ మేకర్స్‌ను బెంబేలెత్తించిన పహ్లాజ్ నిహలానీ తాజాగా ఓ అడల్ట్ ఫిల్మ్‌ కోసం డిస్ట్రిబ్యూటర్‌గా అవతారం ఎత్తడం బాలీవుడ్లో హాట్ టాపిక్ అయింది.

జూలీ 2

జూలీ 2

లక్ష్మీరాయ్ ప్రధానపాత్రలో బాలీవుడ్లో తెరకెక్కుతున్న ‘జూలీ 2' చిత్రాన్ని సెన్సార్ బోర్డ్ మాజీ చీఫ్ పహ్లాజ్ నిహ్లానీ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇటీవల విడుదలైన ట్రైలర్, పోస్టర్లు చూస్తుంటే సినిమాలో బూతు డోసు బాగానే ఉన్నట్లు స్పష్టం అవుతోంది. అలాంటి సినిమాను ‘సంస్కారి' అనే పేరున్న నిహలానీ డిస్ట్రిబ్యూట్ చేయడం ఏమిటి? అంటూ ఆశ్చర్య పోతున్నారు.

మీరు ఇలా అంటారని తెలుసు

జూలీ 2 ట్రైలర్ రిలీజ్ కార్యక్రమంలో పహ్లాజ్ నిహలానీ మాట్లాడుతూ...‘నేను ఈ సినిమా చేస్తున్నాను అంటే మీరూ కూడా ఆశ్చర్యపోతారని తెలుసు. ఈ సినిమాకు నన్ను అనుమతించండి. సినిమా మీకు అందరికీ నచ్చుతుందనే నమ్మకం ఉంది అన్నారు.

లక్ష్మీరాయ్‌ని బ్లెస్ చేయండి

లక్ష్మీరాయ్‌ని బ్లెస్ చేయండి

అందమైన లక్ష్మీరాయ్ ఈ చిత్రంలో జూలీ పాత్రలో కనిపించబోతోంది. ఇప్పటి వరకు ఆమె 49 సినిమాలు చేసింది. ఆమె 50వ చిత్రం ‘జూలీ 2'.... ఆమెకు మీ అందరి బ్లెస్సింగ్స్ కావాలి అని పహ్లాజ్ నిహ్లానీ వ్యాఖ్యానించారు.

ఇపుడు ఏ సినిమాలైనా చేయొచ్చు

ఇపుడు ఏ సినిమాలైనా చేయొచ్చు

నేను ఇపుడు సిబిఎఫ్‌సి పదవిలో గానీ, ఆఫీసులోగానీ లేను.... ఇపుడు నేను ఎలాంటి సినిమాలైనా చేయొచ్చు. కటెంట్ లేకుండా ఏ సినిమాను అమ్మలేము. కేవలం స్కిన్ షో చూసి సినిమా ఎవరూ కొనరు. చివరకు షారుక్ మూవీ ఆడాలన్నా కంటెంట్ కావాల్సిందే అని నిహలానీ వ్యాఖ్యానించారు.

జూలీ 2 ట్రైలర్

ఈ చిత్రంలో రాయ్ ల‌క్ష్మీ తో పాటు ర‌తి అగ్నిహోత్రి, సాహిల్ సలాతియా, ఆదిత్య శ్రీ వాస్త‌వ‌, ర‌వి కిష‌న్, పంక‌జ్ త్రిపాఠి, నిషికాంత్ కామంత్ ప్ర‌ధాన పాత్ర‌లు పోషించారు . అక్టోబర్ 6న సినిమా రిలీజ్ కాబోతోంది. ఈచిత్రానికి దీపక్ శివదాసానీ దర్శకుడు.

English summary
Former Censor Board Chief, Pahlaj Nihalani being a sanskari objected for James Bond films as well saying that Daniel Craig kiss in front of the Indian audience is not a culturally correct thing. He didn't even let Anushka Sharma say the word 'intercourse' in the movie Jab Harry met Sejal. But now, with his job gone, he has quit being a sanskari too. Like in his good old times where he used to be a maker of adult films, he now turned to the distribution of adult thriller movie Julie-2.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu