»   » భార్య గురించి దిల్ రాజు ఆవేదన.. గుండెను పిండేసిన ప్రకటన

భార్య గురించి దిల్ రాజు ఆవేదన.. గుండెను పిండేసిన ప్రకటన

Posted By:
Subscribe to Filmibeat Telugu

శ్రీ వెంకటేశ్వర ఫిలింస్ బ్యానర్లో సమర్పకురాలు, ప్రముఖ నిర్మాత దిల్ రాజు సతీమణి ఇటీవల గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. తన భార్య మరణంతో దిల్ రాజు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఆమెకు నివాళి అర్పిస్తూ దిల్ రాజు విడుదల చేసిన ప్రకటన గుండెను పిండేసింది.

తన భార్య దశ దిన కర్మ సందర్భంగా

తన భార్య దశ దిన కర్మ సందర్భంగా

శ్రీమతి అనితకు శ్రద్ధాంజలి ఘటిస్తూ దిల్ రాజు విడుదల చేసిన ప్రకటన భార్య పట్ల ఆయనకు గల అంతులేని ప్రేమాభిమానాలకు నిదర్శనంగా నిలిచింది.

దిల్ రాజు ప్రేమాభిమానాలకు నిదర్శనం

దిల్ రాజు ప్రేమాభిమానాలకు నిదర్శనం

నా జీవితాన తొలి విజయానివి నువ్వు!!
సినీరంగాన నా తొలి అడుగుకి కారణం నువ్వు!!
నా కష్టం వెనుక గల ధైర్యానివి నువ్వు!!
నా ఇష్టం వెనుక ఉన్న ఆనందానివి నువ్వు!!
నా గెలుపు వెనుక చిరునవ్వువి నువ్వు!!
నా ఓటమి వెనుక ఓదార్పువి నువ్వు!!
అంటూ దిల్ రాజు తన జీవిత భాగస్వామి అనితకు అత్యంత శ్రద్ధతో "ప్రేమాంజలి" ఘటించారు!!

దిల్ రాజు విజయంలో..

దిల్ రాజు విజయంలో..

టాలీవుడ్‌లోని నిర్మాతల్లో దిల్ రాజుది ఓ ప్రత్యేకమైన శైలి. కుటుంబ కథా చిత్రాలను తీయడంలో ఆయనకు ఆయనే సాటి. వెంకట రమణారెడ్డి దిల్ రాజుగా మారడంలో ఆయన సతీమణి అనిత కీలక పాత్రేనని చెప్పుకొంటారు. సినిమా నిర్మాణాల్లో అనిత కీలకంగా వ్యవహరించినా పబ్లిసిటీకి దూరంగా ఉన్నారు.

అమెరికాలో ఉండగా..

అమెరికాలో ఉండగా..

శ్రీమతి అనిత ఇటీవల స్వల్ప అస్వస్థతకు గురై ఆకస్మికంగా మరణించిన సంగతి తెలిసిందే. ఆమె వయసు కేవలం 46 ఏళ్ళు. భార్య మరణించే సమయానికి దిల్ రాజు ఓ సినిమా షూటింగ్ నిమిత్తం అమెరికాలో ఉన్నారు.

English summary
Tollywood producer Dil Raju’s wife Anitha passes away recently. Dil Raju express condolences46-year-old Anita with painful message. Anitha involved in the film distribution business along with her husband Dil Raju.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu