»   » ఎట్టకేలకు నాని ‘పైసా’ విడుదల ఖరారు

ఎట్టకేలకు నాని ‘పైసా’ విడుదల ఖరారు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ ప్రస్తుతం నాని హీరోగా 'పైసా' చిత్రం రూపొందించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో కేథరిన్, సిద్ధిక శర్మ హీరోయిన్లుగా చేస్తున్నారు. ఈచిత్రం ఆడియో విడుదల విడుదలై చాలా రోజులైనా విడుదల తేదీ సంగతి తేలటం లేదు. ఆర్దిక సమస్యలే దీనికి కారణం అని తెలుస్తోంది. రిలీజ్ ఆగిపోయిందనుకున్న ఈ చిత్రం నవంబర్ మూడవ వారంలో విడుదల చేయటానికి నిర్మాత రమేష్ పుప్పాల సన్నాహాలు చేస్తున్నారు. ఈ మేరకు ఆయన మీడియాకు తెలియచేసారు.

ఇక ఆ మధ్య ఈ చిత్రాన్ని బెల్లంకొండ సురేష్ తీసుకున్నట్లు, త్వరలో విడుదల చేయనున్నట్లు బిజినెస్ సర్కిల్స్ లో వినపడింది. నిర్మాత పుప్పాల రమేష్ ..పైనాన్షియల్ గా క్రైసిస్ తో చేతులు ఎత్తేయటంతో...బెల్లంకొండ చిత్రంపై నమ్మకంతో ముందుకు వచ్చాడని చెప్తున్నారు. అయితే తాజా ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆయన కూడా చేతులు ఎత్తేసారని తెలుస్తోంది. దాంతో కథ మళ్లీ మొదటకి వచ్చింది. కానీ వేరే వారి ద్వారా డబ్బు ఎడ్జెస్ట్ చేసుకుని రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు.

ఈ సినిమాకు కృష్ణవంశీ బాగా ఎక్కువ ఖర్చు పెట్టాడని, అది నాని మార్కెట్ ని దాటి పోయిందని, అలాగే కృష్ణవంశీ కి ప్రత్యేకమైన మార్కెట్ వరస ఫ్లాపులతో ఇప్పుడు లేకపోవటం కూడా ఇబ్బంది ఎదురువు అవుతోందని అంటున్నారు. ఎక్కువ రేట్స్ చెప్పటంతో కొనుక్కునేవాళ్లు వెనక అడుగు వేస్తున్నారని ఫిల్మ్ సర్కిల్స్ లో గుసగుసలు వినపడుతున్నాయి.

నాని హీరోగా, కృష్ణ వంశీ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'పైసా' . ఈ చిత్రాన్ని పుప్పాల రమేష్ ఎల్లోఫ్లవర్స్ బేనర్‌పై నిర్మిస్తున్నారు. నాని సరసన కేథరీన్ నటిస్తోంది. హవాలా మనీ చుట్టూ కథ తిరుగుతుంది. ఓల్డ్ సిటికి చెందిన కుర్రాడు డబ్బు మీద మోజుతో హవాలా ట్రాన్సిక్షన్ లోకి లాగబడతాడు. అక్కడ నుంచి వచ్చే సమస్యలతో కథ,కథనం నడుస్తుంది. ఈ చిత్రంలో నాని పేరు... ప్ర'క్యాష్'(Pra'cash'). డబ్బు కంటే అతనికి ఏదీ ఎక్కువ కాదు. దర్శకుడు కృష్ణ వంశీ మార్కుకు ఏమాత్రం తగ్గకుండా ఈచిత్రం ఉండబోతోంది. అన్ని కోణాల్లో తనదైన ముద్రవేస్తూ ఈచిత్రాన్ని తెరకెక్కించారు.

కృష్ణ వంశీ మాట్లాడుతూ.... ''డబ్బు డబ్బు డబ్బు. లేచింది మొదలు ప్రతి ఒక్కరూ పఠించేది మనీ మంత్రమే. పచ్చ నోటు చుట్టూ ప్రదక్షిణలే. వేలు, లక్షలు అనే మాటకి ఇప్పుడు విలువే లేదు. వందల కోట్లు, వేల కోట్లు అంటూ అందరూ సరదాగా మాట్లాడేస్తున్నారు. సంపాదన మోజులో మనుషులమన్న విషయాన్నే మరిచిపోతున్నారు. పచ్చ నోట్ల నీడలో అనుబంధాలు, ఆత్మీయతలు కనుమరుగైపోతున్నాయి. మన జీవనాన్ని, సామాజిక పరిస్థితుల్నీ డబ్బే శాసిస్తోంది. ఈ విషయాన్ని మా చిత్రంలో చూపించాము'' అన్నారు కృష్ణవంశీ.

English summary
Krishnvamsi directed Nani starrer Paisa is finally getting released. The film was scheduled for release last summer but got delayed for financial problems. Looks like the movie is finally seeing the light of the day! Latest release from producer Puppala Ramesh informs us that Paisa will hit the screens in the third week of November.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu