»   » రూ. 200లకు పనిచేసే మోడల్‌గా హీరో నాని (ఫోటోలు)

రూ. 200లకు పనిచేసే మోడల్‌గా హీరో నాని (ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నాని, కేథరిన్ హీరో హీరోయిన్లుగా కృష్ణ వంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'పైసా'. ఈ చిత్రాన్ని ఈ నెల 7న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ సభ్యులు మీడియా సమావేశం ఏర్పాటు చేసారు. ఈ సందర్భంగా దర్శకుడు కృష్ణ వంశీ సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు.

'ఈ సినిమా ద్వారా డబ్బు 11 అవతారం చూపించబోతున్నాం. డబ్బు జీవితంలో ఎలాంటి మార్పులు తీసుకొస్తుంది. దాని కారణంగా మనిషి ఎలా ప్రవర్తిస్తాడనే విషయాన్ని ఇందులో తెలియజేస్తున్నాం. ఇది నానికి సరిపోయే పర్ ఫెక్ట్ రోల్. ఈ సినిమాలో నాని రోజుకు రూ. 200లకు పని చేసే మోడల్‌గా నటిస్తున్నాడు. ఈ సినిమా అందరికీ నచ్చుతుంది. నూర్జహాన్ అనే ముస్లిం యువతి పాత్రలో కేథరిన్ నటిస్తోంది' అన్నారు.

నాని మాట్లాడుతూ...సినిమా ఫైనల్ కాపీ చూసాను. ఎంతో బాగా వచ్చింది. నాకు బాగా దగ్గరైన సినిమా ఇది. ప్రతి ఎపిసోడ్ చాలా రిస్క్ తీసుకుని చేసాం. అంతా ఎంతో కష్టపడి బాగా పని చేసారు. నన్ను ప్రతి యాంగిల్‌లో కొత్తగా చూపించిన సినిమా ఇది అన్నారు. స్లైడ్ షోలో మరిన్ని వివరాలు, ఫోటోలు....

పైసా

పైసా


ఎల్లో ఫ్లవర్స్ బేనర్లో నాని, కేథరిన్ హీరో హీరోయిన్లుగా రమేష్ పుప్పాల నిర్మించిన ‘పైసా' చిత్రానికి కృష్ణ వంశీ దర్శకత్వం వహించారు. సాయి కార్తీక్ ఈచిత్రానికి సంగీతం అందించారు.

విడదల తేదీ

విడదల తేదీ


సాయి కార్తీక్ సంగీతం అందించిన ఈ సినిమాను ఈ నెల 7న విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. ఈ సందర్భంగా ప్రెస్ మీట్ ఏర్పాటు చేసారు.

రమేష్ పుప్పాల

రమేష్ పుప్పాల


సినిమా కోసం అందరం కష్టపడి పని చేసాం. మలేషియా, దుబాయ్ తదితర ప్రాంతాల్లో షూటింగ్ జరిపాం. సాయి కార్తీక సంగీతం అద్భుతంగా కుదిరింది అన్నారు.

సాయి కార్తీక్

సాయి కార్తీక్


సంగీత దర్శకుడు సాయి కార్తీక్ మాట్లాడుతూ...ఈ సినిమాకి పని చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా కోసం ఎంతో ఎగ్జైట్‌గా ఎదరు చూస్తున్నాం. పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను అన్నారు.

కేథరీన్

కేథరీన్


కృష్ణ వంశీ గారి వద్ద పని చేయడం వల్ల ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. సినిమా పెద్ద హిట్టవుతుంది అన్నారు.

English summary
Paisa Movie release Press Meet held at Hyderabad. Actor Nani, Actress Catherine Tresa, Director Krishna Vamsi, Ramesh Puppala graced the event.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu