»   » రెండు రాష్ట్రాల ఫ్యాన్స్‌కు కన్వినెంటుగా... ‘పైసా వసూల్’ ఆడియో రిలీజ్ వేదిక!

రెండు రాష్ట్రాల ఫ్యాన్స్‌కు కన్వినెంటుగా... ‘పైసా వసూల్’ ఆడియో రిలీజ్ వేదిక!

Posted By:
Subscribe to Filmibeat Telugu

నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ తెరకెక్కిస్తున్న చిత్రం 'పైసా వసూల్'. బాలయ్య మార్క్ మాస్ ఎలిమెంట్స్, పూరి మార్క్ స్టైల్ జోడించి తెరకెక్కుతున్న యాక్షన్ ప్యాక్డ్ ఎంటర్టెనర్.

ఇటీవల విడుదలైన 'స్టంపర్' దుమ్ము రేపింది. రికార్డు స్థాయి వ్యూస్ సాధించి సంచలనం క్రియేట్ చేసింది. ఈ స్టంపర్ రిలీజ్ తర్వాత సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. త్వరలో ఆడియో రిలీజ్ గ్రాండ్‌గా చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.


ఆడియో రిలీజ్ డేట్

ఆడియో రిలీజ్ డేట్

ఆడియో వేడుకను ఆగస్టు 17వ తేదీన నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇందు కోసం ఏర్పాట్లు భారీగా చేస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని అభిమానులకు కన్వినెంటుగా ఉండే ప్రదేశాన్ని ఆడియో వేడుక కోసం ఎంపిక చేశారు.


Balakrishna's Paisa Vasool Stumper Release Date Confirmed
ఖమ్మంలో వేడుక

ఖమ్మంలో వేడుక

‘పైసా వసూల్' ఆడియో వేడుకకు 'ఖమ్మం' నగరం వేదిక కానుంది. ఖమ్మంలోని ఎస్. ఆర్. అండ్ బి.జి.ఎన్.ఆర్ కాలేజ్ గ్రౌండ్ లో ఈ వేడుకను జరపనున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల అభిమానులకు కన్వినెంటుగా ఉంటుందనే ఉద్దేశ్యంతో ఇక్కడ ఆడియో వేడుక ప్లాన్ చేశారు.


బాలకృష్ణగారు ఫుల్‌ ఎనర్జిటిక్‌ పాత్రలో

బాలకృష్ణగారు ఫుల్‌ ఎనర్జిటిక్‌ పాత్రలో

దర్శకుడు పూరి జగన్నాథ్‌ మాట్లాడుతూ- ‘‘నందమూరి అభిమానులు కోరుకునే అంశాలన్నీ సినిమాలో పుష్కలంగా ఉన్నాయి. బాలకృష్ణగారు ఫుల్‌ ఎనర్జిటిక్‌ పాత్రలో ఇరగదీసి నటించారు. ముఖ్యంగా యాక్షన్‌ సీక్వెన్స్‌లను ఆయన డూప్‌ లేకుండా చేశారు. ఇప్పటివరకు ఆయన్ను చూడని విధంగా, ఓ కొత్త పాత్రలో ఇందులో చూస్తారు. తొలిసారి బాలకృష్ణగారితో పని చేస్తున్నందుకు గర్వంగానూ, ఆనందంగానూ ఉంది. మా నిర్మాత ఆనందప్రసాద్‌గారు ఎక్కడా ఖర్చుకు వెనుకాడకుండా సినిమా బాగా రావడానికి కృషి చేశారు'' అన్నారు.


పైసా వసూల్

పైసా వసూల్

'పైసా వసూల్‌'ను సెప్టెంబర్‌ 1న విడుదల చేస్తున్నట్టు నిర్మాత వి. ఆనందప్రసాద్‌ ప్రకటించారు. ఈ సినిమా చిత్రీకరణ, డబ్బింగ్‌ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు తుదిదశకు చేరుకున్నాయి. తెర వెనక శ్రియ, ముస్కాన్, కైరా దత్‌ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో ప్రముఖ బాలీవుడ్‌-హాలీవుడ్‌ నటుడు కబీర్‌ బేడి ప్రత్యేక పాత్ర పోషించారు. ఇంకా అలీ, పృథ్వీ, పవిత్రా లోకేష్, విక్రమ్‌ జిత్‌ తదితరులు నటించిన ఈ సినిమాకు సంగీతం: అనూప్‌ రూబెన్స్‌.


అందరినీ నలిపేస్తా..... బాలయ్య ‘పైసా వసూల్' స్టంపర్ అదుర్స్

అందరినీ నలిపేస్తా..... బాలయ్య ‘పైసా వసూల్' స్టంపర్ అదుర్స్

పూరికి ఈ మధ్య సరైన హిట్ లేక పోవడంతో ఆయన బాలయ్యతో చేస్తున్న ‘పైసా వసూల్' మూవీని కొందరు చాలా తక్కువ అంచనా వేశారు. నట సింహం వేట ఎలా ఉండబోతుందనేది దర్శకుడు పూరి జగన్నాథ్‌ ‘స్టంపర్‌' అనే చిన్న శాంపిల్ తో చూపించారు. దీంతో సినిమాపై అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. విలన్స్‌కు 101 ఫీవర్‌... ఫ్యాన్స్‌కు బంపర్‌ ఆఫర్‌... స్టంపర్‌ ఈజ్‌ సింప్లీ సూపర్‌... సోషల్‌ మీడియాలో ఇప్పుడు ఎక్కడ చూసిన ఇదే డిస్కషన్‌ .


మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండిEnglish summary
Nandamuri Balakrishna’s 101st film ‘Paisa Vasool’ is all set for a massive release on 1st September, the makers have zeroed on the audio release date. The latest update reveals that audio will be unveiled on 17th August at SR & BGNR college in Khammam.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X