»   » తూ క్యారే హౌలే.... అంటూ బాలయ్య: ఊగిపోతున్న ఫ్యాన్స్ (ట్రైలర్)

తూ క్యారే హౌలే.... అంటూ బాలయ్య: ఊగిపోతున్న ఫ్యాన్స్ (ట్రైలర్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాలకృష్ణ హీరోగా పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో భవ్య క్రియేషన్స్‌ పతాకంపై వి. ఆనందప్రసాద్‌ నిర్మించిన సినిమా 'పైసా వసూల్‌'. సెప్టెంబర్‌ 1న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. తాజాగా గురువారం సాయంత్రం ఖమ్మంలో భారీ వేడుకలో ఆడియో రిలీజ్ చేశారు.

ఈ సందర్భంగా 'పైసా వసూల్' థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేశారు. ట్రైలర్ రిలీజ్ తర్వాత సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ముఖ్యంగా ట్రైలర్లో బాలయ్య చెప్పిన డైలాగులు కెవ్వు కేక అనే విధంగా ఉన్నాయి. క్యారే హౌలే అంటూ..... బాలయ్య చెప్పిన డైలాగ్స్ అభిమానులను ఊర్రూతలూగిస్తున్నాయి.

నీచ్, కమీనా, ఖతర్నాక్ క్యారెక్టర్

నీచ్, కమీనా, ఖతర్నాక్ క్యారెక్టర్

ఈ చిత్రంలో బాలయ్య నీచ్, కమీనా, ఖతర్నాక్ తరహాలో రఫ్ అండ్ టఫ్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఓ ఆపరేషన్ కోసం బాలయ్యను ఉపయోగించుకుంటారని తెలుస్తోంది.

చాలా తేడా

చాలా తేడా

సినిమాలో బాలయ్య పేరు తేడా సింగ్ అని తెలుస్తోంది. అయితే ఇది మారు పేరా? లేక సినిమాలో రియల్ క్యారెక్టర్ పేరు అనేదా? అనేది తేలాల్సి ఉంది. మేరా నామ్ తేడా... తేడా సింగ్... దిమాక్ తోడా... చాలా తేడా అంటూ బాలయ్య డైలాగ్స్ అదరగొట్టాడు.

దిస్ ఈజ్ వికీ పీడియా రికార్డ్

దిస్ ఈజ్ వికీ పీడియా రికార్డ్

36 దొమ్మీస్, 24 మర్డర్స్, 36 స్టాబింగ్స్.... దిస్ ఈజ్ మై విజువల్ రికార్డ్స్ ఇన్ వికీపీడియా అంటూ బాలయ్య చెప్పిన డైలాగులకు అభిమానుల నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది.

గొడవల్లో గోల్డ్ మెడలిస్ట్

గొడవల్లో గోల్డ్ మెడలిస్ట్

గొడవల్లో గోల్డ్ మెడల్ వచ్చినోన్ని... మళ్లీ టోర్నమెంట్లు పెట్టొద్దు అంటూ.... బాలయ్య చెప్పిన డైలాగ్స్ సినిమాలో యాక్షన్ ఏ రేంజిలో ఉంటుందో స్పష్టం చేస్తోంది.

తూ క్యారే హౌలే..

తూ క్యారే హౌలే..

బీహార్ నీళ్లు తాగినోళ్లనే తీహార్‌లో పోయించా తూ క్యారే హౌలే...... అంటూ బాలయ్య తన మాస్ క్యారెక్టర్ ప్రదర్శించిన తీరు అద్భుతంగా ఉంది అంటూ అభిమానుల నుండి కామెంట్స్ వెల్లువెత్తుతున్నాయి.

మనది నేల టికెట్ బ్యాచ్

మనది నేల టికెట్ బ్యాచ్

ఒరేయ్.... నేను రామకృష్ణ థియేటర్ సందుల్లో పెరిగాను, మనది నేల టికెట్ బ్యాచ్, కసి తీరక పోతే శవాన్ని లేపి మళ్లీ చంపేస్తా అంటూ..... దర్శకుడు పూరి రాసిన డైలాగులకు సూపర్బ్ స్పందన వస్తోంది.

సెప్టెంబర్ 1 రిలీజ్

సెప్టెంబర్ 1 రిలీజ్

సినిమా ప్రారంభోత్సవం రోజున విడుదల తేదీ ప్రకటించడం కామన్. అయితే సినిమాలు స్పీడుగా పూర్తి చేస్తాడని పేరున్న పూరి జగన్నాథ్ తాను అనుకున్న దానికంటే ముందే పూర్తి చేశారు. దీంతో ముందు ప్రకటించిన విడుదల తేదీ కంటే ఓ నెల రోజుల ముందే సినిమా రిలీజ్ చేయబోతున్నారు. ఇండియన్ సినీ చరిత్రలో ఇదో రికార్డ్

బాలయ్య స్టైలిష్ అవతార్

బాలయ్య స్టైలిష్ అవతార్

పూరి సినిమాల్లో హీరోలు ఎంతో స్టైలిష్ గా కనిపిస్తారు. బాలయ్య విషయంలో కూడా స్టైల్ పరంగా పరి ప్రత్యేకమైన కేర్ తీసుకున్నట్లు ట్రైలర్లో బాలయ్య స్టైల్ చూస్తే స్పష్టం అవుతోంది.

అదిరిపోయే యాక్షన్

అదిరిపోయే యాక్షన్

బాలయ్య సినిమా అంటే కత్తులు, వేట కొడవళ్ల, గొడ్డళ్లతో నరకడాలు ఎక్కువగా ఉంటాయి. అయితే ఈ సినిమాలో మాత్రం పూర్తి భిన్నంగా యాక్షన్ సీన్లు ఉండబోతున్నాయి.

మాస్ మసాలా సాంగ్స్

మాస్ మసాలా సాంగ్స్

ఈ చిత్రంలో బాలయ్య అభిమానులకు మంచి కిక్కు ఇచ్చేలా అదిరిపోయే మసాలా సాంగ్స్ కూడా ఉండనున్నాయి. అసలే పూరి సినిమాల్లో ఐటం సాంగ్స్ ఓ రేంజిలో ఉంటాయి. ఇక బాలయ్యతో సినిమా అంటే పూరి ఆ సాంగ్స్ ఎలా ప్రజంట్ చేస్తారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు.

అభిమానులు కోరుకొనే అంశాలన్నీ పుష్కలంగా

అభిమానులు కోరుకొనే అంశాలన్నీ పుష్కలంగా

పూరి జగన్నాథ్ మాట్లాడుతూ - "నందమూరి బాలకృష్ణ తో కలిసి ఫస్ట్ టైమ్ ఈ సినిమా చేస్తున్నందుకు చాలా హ్యాపీ గానూ, గర్వం గానూ ఉంది. నా కెరీర్ లోనే ఇదొక మెమొరబుల్ మూవీ అవుతుంది. బాలకృష్ణ గారు ఈ పాత్ర లో లీనమైన తీరు చూసి వండర్ అయిపోయాను. నందమూరి అభిమానులు కోరుకొనే అంశాలన్నీ ఇందులో పుష్కలంగా ఉంటాయి. డైలాగ్స్, సాంగ్స్ అదిరిపోయే లెవెల్ లో ఉంటాయి' అన్నారు.

ట్రైలర్

పైసా వసూల్ ట్రైలర్

English summary
Here is Nandamuri Balakrishna's iconic trailer of the much awaited film, Paisa Vasool (2017). Directed by Puri Jagannadh, starring Nandamuri Balakrishna, Shriya Saran, Muskan Sethi and Kyra Dutt in lead roles.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X