ఇంటికి రాను అని చెప్పడంతో నటిని కాల్చి చంపిన భర్త
భర్తతో గొడవల కారణంగా ఓ ప్రముఖ నటి హత్య చేయబడ్డ ఘటన వాయువ్య పాకిస్థాన్‌లో బుధవారం చోటు చేసుకుంది. ఇంటికి రమ్మని పిలిస్తే రాక పోవడంతో కోపంతో ఆమె భర్తే కాల్చి చంపినట్లు పోలీసులు వెల్లడించారు.
పాకిస్థాన్‌కు చెందిన ప్రముఖ గాయని రేష్మ... పాష్ఠో స్టేజీ స్టేజ్ ఆర్టిస్టుగా కూడా పాపులర్ అయ్యారు. భర్త ఫైదా ఖాన్‌తో గొడవల కారణంగా ఆమె కొంతకాలంగా ఖైబర్ పంఖ్తువా జిల్లాలోని నౌషెరా ప్రాంతంలోని తన పుట్టింట్లోనే ఉంటున్నారు.

కొంతకాలం పాటు విదేశాల్లో పని చేసిన ఫైదా ఖాన్ తిరిగి పాక్ వచ్చి.... భార్యను ఇంటికి రావాల్సిందిగా కోరాడు. అందుకు ఆమె నిరాకరించంతో గొడవ చేశాడు. గొడవ ముదరడంతో ఫైదా ఖాన్ రేష్మపై కాల్పులు జరుపడంతో ఆమె అక్కడికక్కడే మరణించారు.
రేష్మ సోదరుడు ఒబెయిదుల్లా ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి ఫైదా ఖాన్‌ను అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగిస్తున్నారు. రేష్మ హత్య పాకిస్థాన్‌లో సంచలనం అయింది.


Click it and Unblock the Notifications











