»   » భర్తకు బాలీవుడ్ భామ బై బై.. విడాకులు మంజూరు

భర్తకు బాలీవుడ్ భామ బై బై.. విడాకులు మంజూరు

Posted By:
Subscribe to Filmibeat Telugu

పాకిస్థాన్‌ సంతతికి చెందిన బాలీవుడ్ నటి వీణా మాలిక్, అసద్ ఖటాక్ దంపతులు విడాకులు తీసుకొన్నారు. వీరికి లాహోర్‌ ఫ్యామిలీ కోర్టు విడాకులు మంజూరు చేసింది. దీంతో మూడు సంవత్సరాల వైవాహిక జీవితానికి తెరపడింది. వీరికి ఇద్దరు సంతానం ఉన్నారు. వైవాహిక జీవితంలో వ్యక్తిగత అభిప్రాయ బేధాలు తలెత్తడంతో జనవరిలో విడాకుల కోసం వీణామాలిక్ లాహోర్ కోర్టును ఆశ్రయించింది. వీణామాలిక్ అభ్యర్థనను కోర్టు పరిగణనలోకి తీసుకొని విడాకులు మంజూరు చేసింది.

Pakistani actress Veena Malik gets divorce with Khattak

వీణామాలిక్ విడాకులు కోరినందున వరకట్నం సొమ్ములో 25 శాతం మేర ఖటాక్‌కు చెల్లించాలని తీర్పు చెప్పింది. 2013 డిసెంబర్‌లో దుబాయ్ కోర్టులో వీరు వివాహం చేసుకొన్నారు. బిగ్‌బాస్ కార్యక్రమం ద్వారా టీవీ ప్రేక్షకులకు వీణా మాలిక్ సుపరిచితులు. డర్టీ పిక్చర్, గలీగలీ మే చోర్ హై, దాల్ మే కుచ్ కాలా హై, సూపర్ మోడల్ తదితర చిత్రాల్లో నటించింది.

Pakistani actress Veena Malik gets divorce with Khattak
English summary
Pakistani actor Veena Malik has ended her three-year-old marriage with Asad Bashir Khan Khattak after a family court here granted them divorce.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu