»   » అవకాశాల్లేక గుడిముందు అడుక్కుంటూ: నటుడు కావాలన్న కల అతన్ని ఏం చేసిందంటే....

అవకాశాల్లేక గుడిముందు అడుక్కుంటూ: నటుడు కావాలన్న కల అతన్ని ఏం చేసిందంటే....

Posted By:
Subscribe to Filmibeat Telugu

"సినిమా ఒక రంగుల ప్రపంచం" కొన్ని సంవత్సరాలుగా ఈ మాటని వడుతూనే ఉన్నారు అయినా ఆ రంగులకు ఆకర్శింపబడి వచ్చి దీపం పురుగుల్లా మాడిపోతూనే ఉన్నారు చిన్న చిన్న నటులు. కొంతకాలం ఏదో ఒకలాగా అవకాశం కోసం ప్రయత్నించి తర్వాత వేరే ఏదో ఒక రంగం లో స్థిరపడ్డ్వాళ్ళు కొందరైతే ఆ కలని నెరవేర్చుకోలేక డిప్రెషన్ కి లోనై ఆత్మహత్యలు చేసుకున్నవాళ్ళూ ఉన్నారు. ఇదిగో కోలీవుడ్ లో ఇతని పరిస్థితి చూసాక ఎవ్వరికైనా కళ్ళు చమర్చక మానవు

భరత్, సంధ్య జంటగా నటించిన కాదల్‌ చిత్రం 2004లో సంచలన విజయం సాధించింది. ఈ చిత్రంలో ఒక చిన్న వేషం వేసి అందరినీ అలరించిన పల్లుబాబు ఇప్పుడు గుడి ముందు భిక్షాటన చేస్తూ జీవనం గడుపుతున్నాడు. ఆ చిత్రంలో సినిమా అవకాశాలను వెతుక్కుంటూ చెన్నైకి వచ్చి ఓ మ్యాన్షన్‌లో ఉండే యువకుడిగా పల్లుబాబు నటించాడు.

Pallu Babu, Kadhal movie comedian begs in Chennai

అందులో విరుచ్చికాంత్‌ అనే పేరును పెట్టుకుని నేను నటిస్తే హీరోగానే, ఆ తరువాత రాజకీయం, సీఎం అంటూ అతను చెప్పే డైలాగ్స్‌ బాగా పాపులర్‌ అయ్యాయి. అయితే అతను మాత్రం పాపులర్‌ కాలేకపోయాడు. కాదల్‌ చిత్రం తరువాత పల్లుబాబుకు అవకాశాలు రాలేదు. దీంతో పేదరికం, తల్లిదండ్రుల మరణంతో పల్లుబాబు మానసికంగా కుంగిపోయాడు. చివరికు కడుపు నింపుకోవడానికి స్థానిక చూలైమేడులోని గుడి ముందు భిక్షాటన చేస్తూ జీవనం గడుపుతున్నాడని అతడిని చూసిన స్థానికులు తెలిపారు.

English summary
Pallu Babu actor in Kadhal (preamiste in telugu) movie comedian begs in Chennai
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu