Don't Miss!
- Travel
రాయలసీమలో దాగిన రహస్యాల మూట.. గుత్తి కోట!
- News
AP DGP Twitter : ఏపీ డీజీపీ ట్విట్టర్ ఖాతాలో బూతు బొమ్మలు- డీఐజీ వార్నింగ్..
- Lifestyle
Chanakya Niti: చాణక్య నీతి ప్రకారం ఈ రహస్యాలను ఎవరితో షేర్ చేసుకోవద్దు, అవేంటంటే..
- Finance
Sahara: భయంలో జీవిస్తున్న మహిళ.. సుబ్రతా రాయ్‌తో సహా 22 మందిపై కేసు..
- Sports
INDvsNZ : హార్దిక్, షమీ అవుట్.. ఉమ్రాన్ ఇన్.. మూడో వన్డే ఆడే భారత జట్టు ఇదే!
- Technology
Apple నుంచి తర్వాత రాబోయే, iPhone 15 ప్రో ఫీచర్లు లీక్ అయ్యాయి! వివరాలు
- Automobiles
రూ. 25,000 చెల్లించి సిట్రోయెన్ eC3 బుక్ చేసుకోండి - పూర్తి వివరాలు
Prabhas మూవీ ఫెస్టివల్.. 6 నెలల గ్యాపులో ప్రభాస్ 3 సినిమాలు.. ఇక ఫ్యాన్స్ కు పండగే!
దివంగత కష్ణంరాజు నట వారసుడిగా తెలుగు సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు ప్రభాస్. ఈశ్వర్ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్.. విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్నాడు. ఇక బాహుబలి చిత్రంతో ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్ ఎదిగాడు. ఆ సినిమా నుంచి ప్రభాస్ చేసే ప్రతి మూవీని పాన్ ఇండియా స్థాయిలోనే చేస్తూ అలరిస్తున్నాడు. అయితే బాహుబలి తర్వాత చేసిన సాహో, రాధేశ్యామ్ అంతగా సక్సెస్ తేలేకపోయాయి. దీంతో ప్రభాస్ తర్వాత సినిమా అయినా సూపర్ హిట్ కావాలని అభిమానులు తెగ కోరుకుంటున్నారు. ఈ క్రమంలో ప్రభాస్ ఫ్యాన్స్ కు సూపర్ గుడ్ న్యూస్ వెలువడింది.

భారీ బడ్జెట్ చిత్రాలతో..
పెద్ద ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్‌తోనే సినిమాల్లోకి వచ్చినా అతి తక్కువ సమయంలో టాలీవుడ్‌లో స్టార్ హీరోగా ఎదిగాడు ప్రభాస్. అలా చాలాకాలంగా తెలుగులో సత్తా చాటుతున్న ప్రభాస్.. దర్శక దిగ్గజం, జక్కన్న రాజమౌళి తెరకెక్కించిన 'బాహుబలి' సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయాడు. దీంతో అప్పటి నుంచి భారీ బడ్జెట్ చిత్రాలతో చేస్తూ సత్తా చాటుతు గ్లోబల్ స్టార్ గా మారాడు ప్రభాస్.

చెప్పింది ఒకటి.. చేసింది మరొకటి..
బాహుబలి మూవీ సిరీస్ తర్వాత విడుదలైన సాహో, రాధేశ్యామ్ కు ఆశించినంతగా విజయం దక్కపోవడంతో ప్రభాస్ తర్వాత సినిమాపైనే ఆశలు పెట్టుకున్నారు. ఈ క్రమంలోనే బాలీవుడ్ డైరెక్టర్ ఓం రావత్ తెరకెక్కిస్తున్న ఆదిపురుష్ టీజర్ విడుదల చేశారు. ఆ టీజర్ పై యావత్ సినీ ప్రేక్షకులు పెదవి విరిచారు. డైరెక్టర్ చెప్పిన దానికి చూపించిన ఔట్ పుట్ కు ఎలాంటి సంబంధం లేదని అసహనం వ్యక్తం కాగా.. నటీనటుల వేషధారణపై కాంట్రవర్సీ కూడా క్రియేట్ అయింది.

మరో బాలీవుడ్ దర్శకుడితో..
ఇక
పాన్
ఇండియా
స్టార్
ప్రభాస్
చేతిలో
ఆదిపురుష్
తో
పాటు
మరో
ఐదు
సినిమాలు
ఉన్నాయి.
వాటిలో
ప్రశాంత్
నీల్
దర్శకత్వంలో
'సలార్',
నాగ్
అశ్విన్
దర్శకత్వంలో
'ప్రాజెక్ట్
K',
సందీప్
రెడ్డి
వంగాతో
'స్పిరిట్'
మారుతితో
హారర్
కామెడీ
చిత్రంగా
'రాజా
డీలక్స్'
ఉండగా..
ఇటీవలే
మరో
బాలీవుడ్
డైరెక్టర్
సిద్ధార్థ్
ఆనంద్
దర్శకత్వంలో
ప్రభాస్
తో
ఒక
సినిమా
ప్లాన్
చేస్తున్నామని
మైత్రీ
మూవీ
మేకర్స్
నిర్మాత
యెర్నేని
నవీన్
తెలిపారు.
దీంతో
ప్రభాస్
చేతిలో
మొత్తంగా
ఆరు
సినిమాలు
ఉన్నాయి.

ఒక సినిమా ఫీవర్ తగ్గేలోపు..
అయితే తాజాగా ప్రభాస్ అభిమానులు పండగ చేసుకునే ఓ వార్త వచ్చింది. అదేంటంటే ప్రస్తుతం ఆరు సినిమాలతో ప్రభాస్ బిజీగా ఉండగా.. అందులో మూడు సినిమాలు 6 నెలల్లో విడుదల కానున్నాయి. అంటే 2 నెలలో గ్యాప్ లో ఒక్కో మూవీ రిలీజ్ కానుంది. ఒక సినిమా ఫీవర్ తగ్గేలోపు మరో మూవీతో సందడి చేయనున్నాడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్. దీంతో ప్రభాస్ సినిమాలతో థియేటర్లు గోల గోలగా మారనున్నాయి.

ఎలాంటి మార్పు లేకుండా..
బాలీవుడ్
దర్శకుడు
ఓం
రావత్
తెరకెక్కించిన
ఆది
పురుష్
చిత్రాన్ని
2023,
జూన్
16న
విడుదల
కానుంది.
ఇప్పటికే
పలు
మార్లు
వాయిదా
పడిన
ఈ
సినిమా
కచ్చితంగా
ఇదే
తేదీన
ప్రేక్షకుల
ముందుకు
రానుందని
మేకర్స్
ప్రకటించారు.
అలాగే
ప్రశాంత్
నీల్
దర్శకత్వంలో
వస్తోన్న
సలార్
రిలీజ్
డేట్
సెప్టెంబర్
28కి
ఫిక్స్
చేశారు.
ఈ
సినిమా
విడుదల
విషయంలో
కూడా
ఎలాంటి
మార్పు
లేదని
సమాచారం.

సంక్రాంతి కానుకగా..
ఇక మారుతి ప్రభాస్ కాంబినేషన్ లో రాజా డీలక్స్ గా ప్రచారం అవుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది అంటే 2024 సంక్రాంతి కానుకగా విడుదలయ్యే అవకాశాలు ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా మేకర్స్ ఇప్పటికీ రిలీజ్ డేట్ ను ప్రకటించనప్పటికీ వచ్చే ఏడాది సంక్రాంతికి తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ఇలా కేవలం 6 నెలలో గ్యాపులో ప్రభాస్ నటించిన మూడు సినిమాలు విడుదల కావడం విశేషంగా చెప్పుకోవచ్చు. .