»   » 'వేదం' కోసం వెనక్కితగ్గిన 'పంచాక్షరి'

'వేదం' కోసం వెనక్కితగ్గిన 'పంచాక్షరి'

Posted By:
Subscribe to Filmibeat Telugu

అనుష్క నటించిన పంచాక్షరి, వేదం చిత్రాలు రెండూ ఒక రోజు తేడాలో రిలీజ్ అవుతాయని ఆమె అభిమానులు సంబర పడ్డారు. ఎందుకంటే వేదంలో వేశ్యగా కనపడే ఆమె పంచాక్షరి చిత్రంలో ఓ పవిత్రమైన పాత్రలో కనిపించనుంది. అయితే తాజాగా జరిగిన సెటిల్మెంట్స్ ప్రకారం పంచాక్షరి చిత్రాన్ని పదవ తారీఖుకు వాయిదా వేసారని సమాచారం. ఆమె నటించిన రెండు చిత్రాలు ఒకదానికొకటి క్లాష్ అవటం డిస్ట్రిబ్యూటర్స్ కి దెబ్బ అని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక వేదం చిత్రాన్ని గమ్యం దర్శకుడు క్రిష్ రూపొందించారు. అల్లు అర్జున్, మంచు మనోజ్ ఈ చిత్రంలో నటిస్తున్నారు. అలాగే పంచాక్షరి చిత్రం సముద్ర దర్శకత్వంలో రెడీ అయింది.ఇక అరుంధతిగా అదరకొట్టిన అనుష్క త్వరలో 'కాంచన' గా నూ కనువిందు చేయనుంది. కొరియోగ్రాఫర్ నుంచి డైరక్టర్ కమ్ హీరోగా మారిన లారెన్స్ ఈ చిత్రం డైరక్ట్ చేయనున్నాడు. ఆయన నటించిన 'ముని' చిత్రానికి సీక్వెల్ ఇది. మరో ప్రక్క త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ సరసన అనుష్క చేస్తున్న సంగతి తెలిసిందే.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu