»   » క్షణం కూడా ఆలోచించకుండా నాగార్జున సరేనన్నారు

క్షణం కూడా ఆలోచించకుండా నాగార్జున సరేనన్నారు

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఆయన పేరును వాడుకుంటాననగానే క్షణం కూడా ఆలోచించకుండా కూడా సరేననడం వేరు. అంతటి గొప్ప మనసు నాగార్జునగారిది అంటున్నారు 'పంచాక్షరి' నిర్మాత చంద్ర. నాగార్జున పర్శనల్ మేకప్ మెన్ అయిన చంద్ర అనుష్క ప్రధాన పాత్రలో వి.సముద్ర దర్శకత్వంలో 'పంచాక్షరి' తీసారు. ఆయనకు ఈ విషయంలో నాగార్జున సాయం చేసారు. ఆ విషయం చెపుతూ...గోవాలో నాగార్జునగారికి ఈ కథ చెప్పాం. ఆయనకు కూడా నచ్చింది. కొన్ని మార్పులు సూచించారు. సమర్పకుడిగా ఆయన పేరు వేసుకుంటానంటే వెంటనే ఒప్పుకున్నారు.

పర్శనల్ మేకప్ మెన్ ని కాబట్టి ఇతరత్రా సాయం చేయడం వేరు.సినిమాలో నటించడానికి కూడా ఆయన సిద్ధపడ్డారు. కానీ నేనే ఈ సినిమా కాదు. తర్వాత చేద్దురులెండి అన్నాను. వారి దగ్గర పనిచేస్తూ నటించమని అడగడం సబబనిపించలేదు. 'పంచాక్షరి' గురించి నాగ్ ప్రతిరోజూ అడిగేవారు. సినిమా గురించి నా కన్నా ఎక్కువ ఆయనే టెన్షన్ పడ్డారు. ఎక్కువ శ్రద్ధ తీసుకున్నారు. నా సినిమా ఆఫీసును కొబ్బరికాయ కొట్టి ప్రారంభించింది కూడా నాగార్జునగారే. ఆయనకి సినిమాలో సెకెండాఫ్ బాగా నచ్చింది అన్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu