»   » ‘పండగ చేస్కో’ ఆడియో రిలీజ్ (ఫోటోస్)

‘పండగ చేస్కో’ ఆడియో రిలీజ్ (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో యూనైటెడ్ మూవీస్ పతాకం పరుచూరి ప్రసాద్ సమర్పణలో పరుచూరి కిరిటీ నిర్మిస్తున్న చిత్రం ‘పండగ చేస్కో'. ఈ చిత్రానికి థమన్ అందించిన ఆడియో ఆవిష్కరణ శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ లోని జే.ఆర్.కన్వెన్షన్ సెంటర్‌లో జరిగింది.

ప్రముఖ దర్శకుడు శ్రీను వైట్ల, సురేందర్ రెడ్డి, ఠాగూర్ మధు, నోముల ప్రకాష్ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరై ఆడియో సీడీ, ట్రైలర్ ఆవిష్కరించారు. ఆదిత్య మ్యూజిక్ ద్వారా పాటలను విడుదల చేసారు. ఈ సందర్భంగా రామ్ మాట్లాడుతూ...థమన్ మంచి మ్యూజిక్ ఇచ్చాడు. ఈ సినిమా స్క్రీప్టు చాలా బావుంది. అది వినగానే ఇలాంటి స్క్రిప్టు నాకు దొరకడం లక్కీగా భావించాను. ఈ స్క్రిప్టు గోపీచంద్ మలినేని చేతిలో పడటంతో సినిమా నెక్ట్స్ లెవల్ కి వెళ్లింది. కోన వెంకట్, వెలిగొండ శ్రీనివాస్, అనిల్ రావిపూడి వంటి మంచి రైటర్స్ దొరకడం కూడా సినిమా ప్లస్సయింది. ఈ మధ్య చాలా గ్యాప్ తీసుకున్నాను. ఈ గ్యాపులో మూడు స్క్రిప్టులు రెడీ చేసకున్నాను. వరుస సినిమాలతో మీ ముందుకు వస్తాను అన్నారు.


స్లైడ్ షోలో ఫోటోలు, మరిన్న వివరాలు...


గోపీచంద్ మలినేని మాట్లాడుతూ...

గోపీచంద్ మలినేని మాట్లాడుతూ...

రామ్ లోని ఎనర్జీని ఈ సినిమా కోసం బాగా వాడాను. రామ్ లోని కొత్త యాంగిల్ చూస్తారు. క్లైమాక్స్ లో రామ్ నటన సూపర్ అన్నారు.


కథ గురించి...

కథ గురించి...

రామ్ తో ఎప్పటి నుండో సినిమా అనుకుంటున్నాను. ఇప్పటికి కుదిరింది. ఈ కథను నేను, కోన వెంకట్ గారు కలిసి వెలిగొండ శ్రీనివాస్ దగ్గర విన్నాం. కోన వెంకట్, వెలిగొండ, అనిల్ రావిపూడి కలిసి నా వెనక ఉండి నన్ను ముదుకు నడిపించారని గోపీచంద్ మలినేని అన్నారు.


బ్రహ్మానందం మాట్లాడుతూ..

బ్రహ్మానందం మాట్లాడుతూ..

ఈ సినిమాలో రామ్ ఆకలిగొన్న పులిలా ఆవురావురుమని ఉన్నాడు. క్లైమాక్స్ లో అద్భుతంగా నటించాడు. గోపీచంద్ అందరి దగ్గర కావాల్సిన నటన రాబట్టుకున్నాడు అన్నారు.


తారాగణం

తారాగణం

రామ్, రకుల్ ప్రీత్ సింగ్, సోనాల్ చౌహాన్, సాయి కుమార్, రావు రమేష్, బ్రమ్మానందం, జయప్రకాష్ రెడ్డి, రఘుబాబు, సుప్రీత్, బ్రహ్మాజీ, సుబ్బరాజు, అభిమన్యుసింగ్, వెన్నెల కిషోర్, ప్రభాస్ శీను, ఫిష్ వెంకట్, తేజస్విని తదితరులు నటిస్తున్నారు.


తెర వెనక

తెర వెనక

ఈ చిత్రానికి కథ: వెలిగొండ శ్రీనివాస్, మాటలు: కోన వెంకట్, రచనా సహకారం: అనిల్ రావిపూడి, కెమెరా: ఆర్థర్ విల్సన్, ఎడిటింగ్: గౌతం రాజు, ఆర్ట్: ఎ.ఎస్.ప్రకాష్, ఫైట్స్: రామ్-లక్ష్మణ్, సంగీతం: థమన్, పాటలు: భాస్కర భట్ల, శ్రీమణి, డాన్స్: రాజు సుందరం, కాస్టూమ్స్: రమేష్, మేకప్: టి.నాగు, చీఫ్ కో డైరెక్టర్: బి.సత్యం, ప్రొడక్షన్ కంట్రోలర్: యోగానంద్, సమర్పణ: పరుచూరి ప్రసాద్, నిర్మాత: పరుచూరి కిరిటీ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: గోపీచంద్ మలినేని.
English summary
PANDAGA CHESKO Audio released. The audio function held at Hyderabad.
Please Wait while comments are loading...