»   » ‘పండగ చేస్కో’ సెన్సార్ సర్టిఫికెట్ ఇదే...

‘పండగ చేస్కో’ సెన్సార్ సర్టిఫికెట్ ఇదే...

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : యంగ్, ఎనర్జిటిక్ స్టార్ రామ్ కథానాయకుడిగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'పండగ చేస్కో'. పరుచూరి కిరీటి నిర్మాత. పలుమార్లు విడుదల వాయిదా పడిన ఈ చిత్రాన్ని మే 29న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

తాజాగా ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకంది. సెన్సార్ బోర్డు ఈచిత్రాని యు/ఎ సర్టిఫికెట్ జారీ చేసింది. సినిమా మొత్తం 162 నిమిషాల నిడివితో ఉండబోతోంది. చాలా కాలంగా సరైన హిట్ లేని రామ్ ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నాడు.


Pandaga Chesko censor completed

ఇటీవల విడుదలైన ట్రైలర్, పాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ట్రైలర్ చివర్లో బ్రాహ్మి కిక్ ఎక్కించాడు. రకుల్ ప్రీత్ సింగ్, సోనాల్ చౌహాన్ కథానాయికలుగా నటించారు. అమెరికా నుండి ఇండియా వచ్చిన ఎన్నారై యువకుడి పాత్రలో రామ్ నటిస్తున్నారు. వీకెండ్ వెంకట్రావ్ గా బ్రహ్మానందం వినోదం పంచనున్నారు. వెలిగొండ శ్రీనివాస్ కథ అందించారు.

English summary
The censor formalities of Ram's 'Pandaga Chesko' have been completed and the film is all set for a release on May 29th. The movie received a U/A from the CBFC.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu