»   » రివ్యూలతో సంబంధం లేకుండా ‘పండగ చేస్కో’ హిట్ (ఫోటోస్)

రివ్యూలతో సంబంధం లేకుండా ‘పండగ చేస్కో’ హిట్ (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రామ్, రకుల్ ప్రీత్ సింగ్, సోనాల్ చౌహాన్ హీరో హీరోయిన్లుగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన ‘పండగ చేస్కో' చిత్రం కథ గతంలో తెలుగులో వచ్చిన పలు హిట్ సినిమాల స్టోరీ లైన్ ను పోలి ఉందనే విమర్శలు ముందు నుండీ వినిపిస్తున్నాయి. ఈనేపథ్యంలో రామ్ స్పందించారు.

‘పండగ చేస్కో' ప్లాటినమ్ డిస్క్ వేడుకలో రామ్ మాట్లాడుతూ...‘2008లో కథ విన్నపుడు కొత్తగా అనిపించింది. కానీ ఈ మధ్యలో కొన్ని సినిమాలు విడుదల కావడంతో సినిమా రిపీట్ కాన్సెప్టుగా అనిపించవచ్చు' అని చెప్పుకొచ్చారు.


సినిమాకు టాప్ టెక్నీషియన్స్ పని చేసారు. ప్రతి ఒక్కరూ ఈ సినిమా తమదిగా భావించి చేసారు. పరుచూరి ప్రసాద్ గారు దాదాపు ఒకటిన్నర సంవత్సరం ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. గోపీచంద్ మలినేని ఎలాంటి సినిమాని అయినా స్పాన్ పెంచి చేస్తాడు. సినిమాను సక్సెస్ చేసిన ప్రేక్షకులకు థాంక్స్ అని చెప్పుకొచ్చారు రామ్.


వివి వినాయక్ మాట్లాడుతూ...రివ్యూలతో సంబంధం లేకుండా మంచి కలెక్షన్స్ తో ముందుకు సాగుతోంది. సినిమాను ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. గోపీచంద్ బలుపు తర్వాత మరో హిట్ అందుకున్నారు. టీం అందరికీ అభినందనలు అన్నారు.


గోపీచంద్ మలినేని మాట్లాడుతూ...ఈ సినిమా సక్సెస్ కావడానికి రెండు కారణాలు ఉన్నాయి. సినిమా ఫుల్ ఎంటర్టెనింగుగా ఉండటం, ఫ్యామిలీ డ్రామా ఉండటం. టీం మొత్తం కష్టపడి పని చేసాం. మా కష్టానికి తగిన ప్రతిఫలం కలెక్షన్స్ రూపంలో కనబడుతుంది అన్నారు.


స్లైడ్ షోలో ఫోటోస్...


రామ్, రకుల్, సోనాల్

రామ్, రకుల్, సోనాల్

పండగ చేస్కో ప్లాటినమ్ డిస్క్ వేడుకలో రకుల్ ప్రీత్ సింగ్, రామ్, సోనాల్ చౌహాన్.


వివి వినాయక్

వివి వినాయక్

ప్లాటినమ్ డిస్క్ వేడుకకు వివి వినాయక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సినిమా సక్సెస్ కావడంపై టీంకు అభినందనలు తెలిపారు.


దిల్ రాజు

దిల్ రాజు

పండగ చేస్కో సినిమా భారీ విజయం సాధిస్తుందని విడుదల ముందే ఊహించానని దిల్ రాజు చెప్పుకొచ్చారు.


రామ్

రామ్

‘2008లో కథ విన్నపుడు కొత్తగా అనిపించింది. కానీ ఈ మధ్యలో కొన్ని సినిమాలు విడుదల కావడంతో సినిమా రిపీట్ కాన్సెప్టుగా అనిపించవచ్చు' అని రామ్ చెప్పుకొచ్చారు.


English summary
Pandaga Chesko Success Meet held at Hyderabad.
Please Wait while comments are loading...