»   » హిట్ జోష్: పాండవులు పాండవులు తుమ్మెద సీక్వెల్

హిట్ జోష్: పాండవులు పాండవులు తుమ్మెద సీక్వెల్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదాబాద్: మంచు వారి ఫ్యామిలీ ప్యాక్ మూవీ 'పాండవులు పాండవులు తుమ్మెద' చిత్రం నిన్న విడుదలై తొలిరోజే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. కామెడీతో పాటు కమర్షియల్ ఎలిమెంట్స్‌తో కూడి ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేయదగ్గ చిత్రంగా ఈ సినిమా పేరు తెచ్చుకుంది. త్వరలో ఈ సినిమా సీక్వెల్ కూడా రాబోతోంది. ఈ విషయాన్ని మంచు మనోజ్ స్వయంగా వెల్లడించారు.

ఓ ఇంటర్వ్యూలో మనోజ్ మాట్లాడుతూ... ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది, ఓపెనింగ్స్ తాము ఊహించిన దానికంటే ఎక్కువగానే ఉన్నాయి, విమర్శకుల రివ్యూలు కూడా అద్భుతంగా వచ్చాయని ఆనందం వ్యక్తం చేసారు. ఇలాంటి ఫ్యామిలీ ఎంటర్టెనర్స్ మరిన్ని తీస్తారా? అనే ప్రశ్నకు స్పందిస్తూ......ఈ చిత్రానికి సీక్వెల్ తీయాలనే ఆలోచనలో ఉన్నాం. అయితే ఇది ఇంకా ఆలోచన దశలోనే ఉంది. అన్నీ కుదరితే త్వరలో పూర్తి వివరాలు ప్రకటిస్తామని అన్నారు మనోజ్.

Pandavulu Pandavulu Tummeda sequel

శ్రీ లక్ష్మి ప్రసన్న పిక్చర్స్-24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకాలపై అరియానా-వివియానా సమర్పణలో మంచు విష్ణువర్ధన్-మనోజ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. మోహన్ బాబు, విష్ణు, మనోజ్, వరుణ్ సందేశ్, తనీష్, వెన్నెల కిషోర్ కథానాయకులుగా తెరకెక్కిన ఈ భారీ మల్టీ స్టారర్లో రవీనా టండన్, హన్సిక, ప్రణీత హీరోయిన్లు. 'లక్ష్యం' ఫేం శ్రీవాస్ దర్శకత్వం వహించిన ఈచిత్రానికి కీరవాణి-మణిశర్మ-బప్పిలహరి-బాబా సెహగల్ సంగీత సారథ్యం వహించారు.

ఈ చిత్రానికి సంగీతం : కీరవాణి-మణిశర్మ-బప్పిలహరి-బాబా సెహగల్, కెమెరా : ఫలణికుమార్, పాటలు: చంద్రబోస్-భాస్కరభట్ల-అనంత శ్రీరామ్, మాటలు: డైమండ్ రత్న, కథ-స్క్రీన్ ప్లే: కోన వెంకట్-బివిఎస్ రవి-గోపీ మోహన్, పోరాటాలు: విజయ్, ఎడిటింగ్: ఎంఆర్ వర్మ, కళ: రఘు కులకర్ణి, పి.ఆర్.ఓ: వంశీ-శేఖర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : విజయ్ కుమార్.ఆర్, సమర్పణ: అవియానా-వివియానా, నిర్మాతలు : మంచు విష్ణువర్ధన్, మంచు మనోజ్, దర్శకత్వం: శ్రీవాస్.

English summary
"The response has been outstanding. Our film has opened to some great reviews, and I want to thank everyone for liking this film so much. Actually, we have a vague idea of making a sequel to Pandavulu Pandavulu Tummeda, but nothing is confirmed as of yet" Manchu Manoj told.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu