పాండురంగడు విశేషాలు....

ఈ చిత్రంలో బాలకృష్ణ పాండురంగడుగా ,పుండరీకుడుగాను రెండు పాత్రలలో కనిపించనున్నారు. టబు కథను కీలకమైన మలుపు తిప్పే వేశ్య పాత్రలో తన అందచందాలను ప్రదర్శించనుంది. ఇక స్నేహ భర్తని మార్చుకోవాలని ప్రయత్నించే చక్కని గృహిణి పాత్రలో కనిపిస్తుంది. ఇక 'లక్ష్మీనరసింహ' తర్వాత సరైన హిట్టు లేని బాలకృష్ణకు ఈ సినిమా చాలా కీలకం. అయినా సినిమా బాగా వచ్చిందని.. కాసుల వర్షం కురిపించటం కాయమని... యూనిట్ వారు ఉషారుగా ఉన్నారు. ఎందుకంటే దర్శకుడు రాఘవేంద్రరావు భక్తిని, ముక్తిని, రక్తిని యోక కాలంలో పండించగల సమర్ధుడని వారి ధీమా. అంతేగాక తన తండ్రి సినిమాను రీమేక్ చేయటంతో ఆయన ఆశీస్సులు కూడా బాలకృష్ణ వెంటే ఉంటాయని అందరూ భావిస్తున్నారు. అన్ని హంగులతో రెడీ అయిన ఈ చిత్రం ఈ నెల 30 న ప్రపంచమంతా రిలజు అవుతోంది.


Click it and Unblock the Notifications











