»   » మరీ ఓవరైందా?: ‘పనిలేని పులిరాజు’ పంచ్ పోస్టర్

మరీ ఓవరైందా?: ‘పనిలేని పులిరాజు’ పంచ్ పోస్టర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ధన రాజ్ హీరోగా పాలేపు మీడియా ప్రై.లి బ్యానర్ పై పి.వి.నాగేష్ కుమార్ నిర్మిస్తున్న చిత్రం 'పనిలేని పులిరాజు'. ఈ చిత్రానికి చాచా దర్శకుడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రం పోస్టర్ ఒకటి విడుదల చేసారు. చూడ్డానికి నవ్వు పెట్టించేలా ఉన్న ఈ పోస్టర్ హాట్ టాపిక్ అయింది. అయితే ఈ పోస్టర్ కాస్త ఓవర్ గా ఉందనే వారూ లేక పోలేదు.

పోస్టర్ విడుదల చేసిన సందర్భంగా సహా నిర్మాత రవి కె పున్నం మాట్లాడుతూ" వంశీ గారి స్టైల్ , కాశీ నాథ్ స్టైల్ కామెడీ ఈ చిత్రం లో ఉంటుంది. దర్శకుడు చాచా చక్కటి డైలాగ్ కామెడీ తో తెరకెక్కించారు. " అన్నారు.

Panileni Puliraju Punch Poster Release

నిర్మాత పి.వి.నగేష్ కుమార్ మాట్లాడుతూ " ధన రాజ్ సోలో హీరోగా నటించిన తొలి చిత్రమిది. పాటలు పెకాడేస్తాయి. ఈ చిత్ర ఆడియో ను అతి త్వరలోనే విడుదల చేయనున్నాం " అని అన్నారు.

ఈ చిత్రం లో ధనరాజ్ సరసన ప్రాచి సిన్హ , శ్వేతా వర్మ , హరిణి, ఇషా, సీమ కథానాయికలుగా నటించారు. రఘు బాబు విలన్ గా కొండవలస ధనరాజ్ కు మామ గా నటిస్తున్న ఈ సినిమా ఆడియో త్వరలోనే విడుదల జరుపుకొని నవంబర్ మొదటి వారం లో విడుదల కానుంది..

English summary
Panileni Puliraju Punch Poster Released. Puliraju is a popular character in our society and Dhanraj is apparently trying to entertain as ‘Puliraju’ with his trade mark comedy touch.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu