twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'పంజా' ఆ విషయంలో ఫెయిలైనట్లే

    By Srikanya
    |

    పవన్ కళ్యాణ్ తాజా చిత్రం పంజా మొన్న శుక్రవారం విడుదలై నెగిటివ్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. వీకెండ్ లలో కలెక్షన్స్ ఎలా ఉన్నా పైరసీ విషయంలో మాత్రం పూర్తిగా ఫెయిలైనట్లే అంటున్నారు. నిర్మాతలు చిత్రం విడుదలకు ముందు భారీ ఎత్తుక అబిమానులను ఉద్దేశించి పైపరీని అరికట్టడంలో సహకరించాలంటూ ప్రకటనలు ఇచ్చారు. అంతేగాక కొన్ని వెబ్ సైట్స్ ను గుర్తించి వాటిలో అప్ లోడ్ చేసినట్లు ఉంటే తెలపాల్సింది అని చెప్పారు. కానీ ఆ విషయంలో సినిమా విడుదల అయ్యాక నిర్మాతలు పెద్దగా పట్టించుకోలేదని అభిమానులు ఆరోపిస్తున్నారు. చిత్రాన్ని ఆన్ లైన్ లోనూ, టోరెంట్స్ లోనూ పైరసి ప్రింట్స్ తో దొరుకుతోందని వారు అంటున్నారు.

    అందువల్ల కొంతలో కొంత కలెక్షన్స్ తగ్గిపోయే ప్రమాదం ఉందంటున్నారు. మొన్న దూకుడు చిత్రానికి నిర్మాతలు జాగ్రత్తలు తీసుకున్నట్లుగా ఈ పంజా విషయంలో తీసుకోవటం లేదని చెప్తున్నారు. దానికి తోడు నిర్మాతలు సినిమా విడుదల అయ్యాక అస్సలు మీడియా ముందుకు వచ్చి కలెక్షన్స్ ప్రకటించటం వంటివి చేయలేదని, దాంతో ఎంత కలెక్షన్స్ వచ్చాయే తమ అభిమానులకు తెలియకుండాపోతోందని, మిగతా హీరోల సినిమాలకు కేవలం కలెక్షన్స్ హైలెట్ చేస్తూ మొదటి రోజు నుంచి ప్రకటనులు ఇవ్వటం చూసైనా నిర్మాతలు పబ్లిసిటీ ప్రారంబించి, పైరసీని ఆపి సినిమాని నిలబెట్టాలని కోరుకుంటున్నారు.

    English summary
    Producers of Panjaa have failed utterly in controlling the piracy. Despite all their warnings and efforts, Panjaa piracy prints are being shared and circulated online.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X