మ్యాంగో లో మన పప్పు ...!
పప్పు మనం ముద్దుగా పిలచుకునే పేరు. తన ముద్దు ముద్దు నటనతో తెలుగు లో తన కంటూ అభిమానులను సంపాదించుకున్నాడు క్రిష్ణుడు. వినాయకుడు, పప్పు సినిమాలతో తన లోని నటనను ప్రదర్శంచి వావ్ అనిపించాడు. బోద్దుగా వుండే 'క్రిష్ణుడు' కోసం నృత్యదర్శకుడు 'అమ్మ రాజశేఖర్' ఓ కథని తయారుచేశారు. ఈ కథ క్రిష్ణుడుకి బాగా సరిపోతుందని అమ్మ రాజశేఖర్ చెప్తున్నారు. సినిమా పేరు 'మ్యాంగో' అని,వచ్చే నెల 10 నుంచి చిత్రీకరణ ప్రారంభం అవుతుందని చెప్పారు.
మ్యాంగో గురించి క్రిష్ణుడు మాట్లాడుతూ 'నా శైలికి సరిపోయే కథ ఇది'. ఈ కథ చెబుతున్నప్పుడే తెగ నవ్వుకున్నాను. సినిమా పేరు బాగా నచ్చింది. ఈ సినిమా కి 'ఓన్లీ ఇన్ సీజన్'అనే ఉపశీర్షిక కూడా ఉంది. అలా ఎందుకు పెట్టారో సినిమా చూస్తే మీకే తెలుస్తుందన్నారు.
దీని సంబంధించిన పూర్తి వివరాలు మరి కొద్ది రోజుల్లో వెల్లడిస్తామని చిత్ర దర్శకుడు అమ్మ రాజశేఖర్ చెప్పారు.


Click it and Unblock the Notifications











