»   » బాలకృష్ణ 'పరమవీర చక్ర' ఆడియో విడుదల ఎప్పుడు?ఎక్కడ?

బాలకృష్ణ 'పరమవీర చక్ర' ఆడియో విడుదల ఎప్పుడు?ఎక్కడ?

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్రముఖ దర్శకుడు డా.దాసరి నారాయణరావు, బాలకృష్ణ కాంబినేషన్ లో రూపొందుతున్నతొలి చిత్రం 'పరమమీర చక్ర' చిత్రం ఆడియో ఈ నెల 29న ఆదిత్య ఆడియో సంస్థ ద్వారా విడుదల కానుంది.తెలుగు చిత్ర పరిశ్రమ అతిరథులు, నందమూరి వంశాభిమానుల సమక్షంలో శిల్ప కళావేదికలో భారీ ఎత్తున ఆడియో ఫంక్షన్‌ను నిర్వహించనున్నారు.దాసరికి 150వ చిత్రం గా ప్రతిష్టాత్మంకంగా రెడీ చేస్తున్న ఈ చిత్రంలో బాలకృష్ణ సినిమా హీరోగా, సైనికాధికారిగా బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. తేజ సినిమా పతాకంపై సి.కళ్యాణ్ నిర్మిస్తున్న ఈ చిత్రం మిగిలిన అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి జనవరి 12న అత్యధిక ప్రింట్లతో చిత్రాన్ని విడుదల చేయనున్నారు.

ఈ సందర్భంగా సి.కళ్యాణ్ మాట్లాడుతూ...జన్మభూమిని శత్రువుల బారి నుంచి కాపాడటమే లక్ష్యంగా చేసుకున్న సైనికుడు ఒకరు. ప్రేక్షకుల్ని రంజింపజేయడమే ధ్యేయంగా పెట్టుకొన్న కథానాయకుడు మరొకరు. ధైర్యానికి మారుపేరు ఒకరైతే. సరదాలకీ సంతోషాలకీి చిరునామా ఇంకొకరు. వీళ్లిద్దరి మధ్యనున్న సంబంధమేమిటో తెలియాలంటే మా చిత్రం చూడాల్సిందే అంటున్నారు. అలాగే కొమరమ్‌ భీమ్‌ గెటప్‌లో వచ్చే గీతం ఉద్వేగభరితంగా ఉంటుంది. దేశ సరిహద్దుల్లో చిత్రించిన ఫైటింగ్ సీన్స్ చిత్రానికి బలాన్నిస్తాయన్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో అమిషా పటేల్, షీలా, నేహా ధూపియా కథానాయికలు. కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, మురళీమోహన్, విజయకుమార్, ఆలీ, హేమ, సుధ ఈ చిత్రంలో మిగతా పాత్రల్లో కనపించనున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu