»   » చిక్కుల్లో లింగం మామ.... ఆమెని జీప్ కి కట్టేయమంటూ ట్వీట్

చిక్కుల్లో లింగం మామ.... ఆమెని జీప్ కి కట్టేయమంటూ ట్వీట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

అధికార పార్టీలో కొనసాగుతూ కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేసి ఇరూక్కోవటం మామూలైపోయింది. బాలీవుడ్ నటులకు, ఆ మధ్య నటుడు అనుపం ఖేర్ కూడా ఇలాగే నోరు జారి దాదాపు బూతులు తిట్టించుకున్నంత పని చేసాడు. ఇప్పుడు తాజాగా పరేష్ రావెల్ వంతు వచ్చింది. ఇంతకీ పరేష్ రావెల్ అంటే చిరు శంకర్ దాదా సినిమాలో "లింగం మామ" గా కనిపించిన నటుడే...

భద్రతా దళాలపై ఎఫ్ఐఆర్ నమోదు

భద్రతా దళాలపై ఎఫ్ఐఆర్ నమోదు

శ్రీనగర్ ఉప ఎన్నిక సందర్భంగా సెంట్రల్ కాశ్మీర్లోని బుద్గాం జిల్లాలోని ఒక గ్రామంలో తమపై దాడి జరపకుండా, ఓ వ్యక్తిని జీపు ముందు భాగానికి కట్టి తీసుకుపోయిన భద్రతా దళాలపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. పోలింగ్ ఆఫీసర్లను చుట్టుముట్టి రాళ్లదాడికి నిరసనకారులు పాల్పడుతున్న వేళ, వారికి రక్షణ కోసం ఓ స్థానిక యువకుడిని జీపు ముందు భాగానికి కట్టి తీసుకెళ్లారు.

వీడియో వైరల్‌ గా మారింది.

వీడియో వైరల్‌ గా మారింది.

అయితే తాను తన చెల్లెలి ఇంటికి వెళుతుంటే, అడ్డగించిన జవాన్లు, తనను బలవంతంగా తీసుకెళ్లి జీపుకు కట్టేశారని, నిరసనకారులతో, రాళ్లు రువ్వే వారితో తనకు సంబంధం లేదని అహ్మద్ విచారణలో పోలీసులకు తెలిపారు. ఇటీవల ఈ వీడియో ఒకటి వైరల్‌ గా మారింది.

ఒక మనిషిని జీపుకు ముందు కట్టేయటం

ఒక మనిషిని జీపుకు ముందు కట్టేయటం

ఏదేమైనా ఒక మనిషిని జీపుకు ముందు కట్టేయటం చట్టం దృష్టిలో కూడా సమర్థ నీయం కాక పోవటం తో దుమారం రేగింది. పలు విమర్శలు చెలరేగాయి.ఈ నేపథ్యంలో జమ్మూ కశ్మీర్ ప్రతిపక్ష నాయకుడు ఒమర్ అబ్దుల్లా ఏప్రిల్లో వీడియోను ట్వీట్ చేస్తూ తక్షణ విచారణ జరిపించాలని డిమాండ్‌ చేసిన సంగతి తెలిసిందే.

అనుచిత వ్యాఖ్యలు

అనుచిత వ్యాఖ్యలు

అయితే ఈ విషయం లోనే ట్విటర్ లో స్పందించిన పరేష్ గత రాత్రి ట్విట్టర్లో ప్రముఖ రచయిత, రాజకీయ కార్యకర్త అరుంధతి రాయ్‌పై అనుచిత వ్యాఖ్యలకు దిగాడు. ఇటీవల జమ్ముకశ్మీర్‌ ఉద్రిక్త పరిస్థితులపై స్పందించిన ఆయన కశ్మీర్‌లో ఆ యువకుడికి బదులుగా.

దుమారం చెలరేగింది

దుమారం చెలరేగింది

అరుంధతిరాయ్‌ను ఆర్మీ జీప్‌కు కట్టాలని ట్వీట్‌ చేశాడు. దీంతో దుమారం చెలరేగింది. పరేశ్ రావెల్ వ్యాఖ్యలపై ట్విట్టర్‌లో మండి పడుతూ నిరసన ఎదురు కావటం తో ఇప్పుడు తనకు సపోర్ట్ గా వచ్చే రీట్వీట్ లని వెతికి మరీ రీట్వీట్ చేసుకోవటం లో మునిగి పోయాడు.

English summary
Bollywood Actor Paresh Rawal receives flak for offensive tweet about Arundhati Roy, paresh ravel well known in Tollywood by the charecter "lingam maama" in shankar Dada MBBS.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu