»   » ప్రభాస్ ని ముంబై భామలు ఎందుకు తిరస్కరిస్తున్నారు? పరిణితి చొప్రా ఫైనలేనా..!?

ప్రభాస్ ని ముంబై భామలు ఎందుకు తిరస్కరిస్తున్నారు? పరిణితి చొప్రా ఫైనలేనా..!?

Posted By:
Subscribe to Filmibeat Telugu

'బాహుబలి' సినిమాతో దేశవ్యాప్తంగా సూపర్‌స్టార్‌ ఇమేజ్‌ సంపాదించుకున్నాడు యంగ్‌రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌. ప్రభాస్ ఇప్పటికే బాహుబలి చిత్రం కోసం అని నాలుగు ఏళ్ళు కేటాయించాడు. ఇప్పుడు చివరికి మరో చిత్రం సాహో లో నటిస్తున్నాడు. ప్రభాస్ లాస్ట్ ప్రాజెక్ట్ 'బాహుబలి: ది కంక్లూజన్‌' సినిమా దాదాపు 1500 కోట్ల రూపాయల కలెక్షన్స్‌ సాధించి దేశంలోనే టాప్‌ గ్రాసర్‌గా నిలిచింది.

సాహో

సాహో

ప్రస్తుతం ప్రభాస్‌ సుజిత్‌ దర్శకత్వంలో ‘సాహో' సినిమాలో నటిస్తున్నాడు. దాదాపు 150 కోట్ల రూపాయల బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా తెలుగుతోపాటు తమిళ, హిందీ భాషల్లో కూడా విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా టీజర్‌ విడుదలైన సంగతి తెలిసిందే.

సందిగ్ధత నెలకొంది

సందిగ్ధత నెలకొంది

అయినప్పటికీ ఈ సినిమాలో ప్రభాస్‌ పక్కన హీరోయిన్‌గా నటించేది ఎవరనే విషయంలో సందిగ్ధత నెలకొంది. ఈ టీజర్ లో ఓ అమ్మాయిని కూడా చూపించినట్లుగా కనిపిస్తుంది కానీ.. ఎవరనే విషయం తెలీకుండా సీన్ ను పూర్తి చేశారు. నిజానికి అసలీ మూవీలో హీరోయిన్ నే ఇంకా ఎంపిక చేయలేదు.

భారీ బడ్జెట్ తో

భారీ బడ్జెట్ తో

తెలుగుతో పాటు.. తమిళ్.. హిందీల్లో కూడా సాహోను రిలీజ్ చేయాలనే ఆలోచన ఉండడంతో.. బాలీవుడ్ భామను ప్రభాస్ పక్కన నటింపచేసేందుకు గట్టి ప్రయత్నాలే జరుగుతున్నాయి. భారీ బడ్జెట్ తో హిందీ , తెలుగు , తమిళ్ భాషల్లో ఈ మూవీ తెరకెక్కబోతుండడం తో ప్రభాస్ కు జోడి హీరోయిన్ కోసం ఇంకా వేట కొనసాగిస్తూనే ఉన్నారు.

తాజాగా మరోపేరు

తాజాగా మరోపేరు

ఇప్పటికే ఈ సినిమాలో హీరోయిన్లుగా కత్రినాకైఫ్‌, శ్రద్ధా కపూర్‌, దిశా పటాని, దీపికా పడుకొనేల పేర్లు వినిపించాయి. తాజాగా మరోపేరు వెలుగులోకి వచ్చింది. బాలీవుడ్‌ నటీమణి పరిణీతి చోప్రా ఈ సినిమాలో హీరోయిన్‌గా ఎంపిక చేసినట్టు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే పరిణీతి చోప్రాను చిత్రబృందం సంప్రదించినట్టు కూడా సమాచారం.

పరిణితి ఏమున్నదో తెలియదు

పరిణితి ఏమున్నదో తెలియదు

మరి ఈ ఆఫర్ ఫై పరిణితి ఏమున్నదో తెలియదు కానీ ప్రభాస్ పక్కన నటించేందుకు రెడీ గా ఉన్నట్లు తెలుస్తుంది. మరి ఈమె పేరు కూడా ప్రచారం తోనే సరిపెడతారా లేక హీరోయిన్ గా ఖరారు చేస్తారా అనేది చూడాలి. తెలుగు.. తమిళ్ వెర్షన్స్ లో హీరోయిన్ గా కనిపించేందుకు అభ్యంతరం లేదంటున్నారట ఈ బాలీ భామలు.

హిందీ వెర్షన్ విషయంలో

హిందీ వెర్షన్ విషయంలో

కానీ హిందీ వెర్షన్ విషయంలో మాత్రం కుదరని అనేస్తున్నారట. ఎంత క్రేజ్ సంపాదించుకున్నా.. బాలీవుడ్ లో ప్రభాస్ ఇంకా స్వయంగా అయితే ప్రూవ్ చేసుకోవాల్సి ఉంది. అందుకే ఇలాంటి అభ్యంతరాలు చెబుతున్నారట. సాహో కూడా బాహుబలి స్థాయిలో హిట్ అయితే గనక అప్పుడు క్యూ కడతారేమో బాలీవుడ్ హీరోయిన్లు కానీ అప్పుడు ప్రభాస్ వాళ్లకి అందే రేంజ్ లో ఉంటాడా?

English summary
With the grand success of Bahubali 2, Prabhas next saho leading actress has become the hot topic of discussion this time. makers have approached Pparineeti chopta for the film saho. There is no confirmation statement yet
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu