»   » పరిటాల రవి పాత్రతో మొప్పించిన వివేక్ ని ఏడిపించిన పరిటాల సునీత...!

పరిటాల రవి పాత్రతో మొప్పించిన వివేక్ ని ఏడిపించిన పరిటాల సునీత...!

Posted By:
Subscribe to Filmibeat Telugu

'రక్త చరిత్ర" చిత్రంలో పరిటాల రవి పాత్ర పోషించిన వివేక్ ఒబెరాయ్ కు వెంకటాపురం ప్రజలు నీరాజనాలు పలుకుతున్నారు. ఈ పాత్ర చేసిన తర్వాత రవన్న అంటే తనకు ప్రత్యేకమైన అభిమానం ఏర్సడిందని వివేక్ పేర్కొన్నాడు. స్వయంగా వెంకటాపురం వెళ్ళి పరిటాల రవి సమాధిని సందర్శించి గౌరవ వందనం తెలియజేసాడు. ఈ సందర్భంగా పరిటాల సునీత ప్రత్యేకంగా ఏర్సాటు చేసిన విందులో కూడా వివేక్ పాల్గొన్నాడు. 5 యేళ్ళ క్రితం చనిపోయిన నా భర్తని మళ్ళీ జీవింప చేసావు అని వివేక్ తో పరిటాల సునీత అన్నదట. ఆ మాటలు విని వివేక్ ఒబెరాయ్ కళ్ళు చెమర్చాయట. అలాగే వెంకటాపురం ప్రజలు వివేక్ లో పరిటాల రవిని చూసుకుని ఇతగాడిని భుజాలు మీద ఎత్తుకుని మరీ గౌరవించారు.

'రక్త చరిత్ర' వాస్తవ సంఘటనలతో కూడిన కల్పిత మంటూనే అరాచకాలకు పాల్పడిన ఓ కుటుంబాన్ని కాపాడే యత్నం చేస్తున్నారని, పార్ట్ -2లో ఏమాత్రం తేడాలొచ్చినా దర్శకుడు వర్మను వదిలేది లేదని పరిటాల కుటుంబీకులు చిత్ర నిర్మాత సి కళ్యాణ్‌ తో వ్యాఖ్యానించినట్టు తెలిసింది. రక్తచరిత్ర సినిమాలోని పరిటాల రవీంద్ర పాత్రధారి వివేక్ ఒబెరాయ్‌ తోపాటు, సినీ నిర్మాత సి కళ్యాణ్, దర్శకుడు వర్మ సమీపబంధువు సుమన్ వెంకటాపురం విచ్చేశారు. వారికి గౌరవ సూచకంగా ఆతిథ్యం ఇచ్చిన పరిటాల కుటుంబీకులు అనంతరం చిత్రంలోని అంశాలపై చర్చంచినట్టు సమాచారం.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu