‘పరమాణు’... పోక్రాన్ అణు పరీక్షలపై మూవీ (ఫస్ట్ లుక్)
పోక్రాన్ అణుపరీక్షలపై బాలీవుడ్లో సినిమా రాబోతోంది. ఈ చిత్రానికి ‘పరమాణు’ అనే టైటిల్ ఖరారు చేశారు. జాన్ అబ్రహం హీరో.
ముంబై: పోక్రాన్ అణుపరీక్ష కథాంశంతో బాలీవుడ్లో ఓ చిత్రం వస్తోంది. జాన్ అబ్రహం హీరోగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి 'పరమాణు' అనే టైటిల్ ఖరారు చేశారు. తాజాగా పరమాణు ఫస్ట్ లుక్ విడుదలైంది.
'పరమాణు' చిత్రానకి అభిషేక్ శర్మ డైరక్షన్ చేస్తున్నారు. 1998లో భారత ప్రభుత్వం పోక్రాన్‌లో అణుపరీక్ష నిర్వహించింది. ఆ స్టోరీతోనే ఈ ఫిల్మ్‌ను రూపొందిస్తున్నారు. డిసెంబర్ 8న ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

'పరమాణు' చిత్రం షూటింగ్ ప్రస్తుతం రాజస్థాన్ లోని పోక్రాన్ ప్రాంతంలో జరుగుతోంది. పోక్రాన్ అణుపరీక్షల మిషన్ ఎలా నిర్వహించారు. ఈ మిషన్ జరుగుతున్న క్రమంలో శాస్త్రవేత్తలు ఎలాంటి సవాళ్లు ఎదుర్కొన్నారు అనేది ఈ సినిమాలో చూపించబోతున్నారు.
ఈ చిత్రంలో డయానా పెంటీ, బోమన్ ఇరానీ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. సినిమా మొత్తం ఉత్కంఠ భరితంగా సాగుతుందని, ఆసక్తికర స్క్రీన్ ప్లే ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని చిత్ర యూనిట్ సభ్యులు తెలిపారు.


Click it and Unblock the Notifications











