twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సంజయ్‌దత్‌ పెరోల్‌పై వివాదం...పూర్తి డిటేల్స్

    By Srikanya
    |

    ముంబయి: జైలుశిక్ష అనుభవిస్తున్న బాలీవుడ్‌ నటుడు సంజయ్‌దత్‌కు పెరోల్‌ ఇవ్వడం వివాదాస్పదమైంది. పుణెలోని ఎరవాడ జైలు ఎదుట నిరసనలు వ్యక్తం చేయడంతో ప్రభుత్వం స్పందించి విచారణకు ఆదేశించింది. పుణె డివిజనల్‌ కమిషనర్‌ ప్రభాకర్‌ దేశ్‌ముఖ్‌ శుక్రవారం సంజయ్‌దత్‌కు పెరోల్‌ జారీ చేశారు. దత్‌ ఇంతకుముందు వైద్యపరమైన కారణాలతో నెల రోజులపాటు సెలవుతో జైలు బయటికి వెళ్లి అక్టోబర్‌ 30న తిరిగి జైలుకెళ్లారు. ఈసారి తన భార్య మాన్యత అనారోగ్యాన్ని కారణంగా చూపి పెరోల్‌ కోరారు.

    అయితే, మాన్యత ఓ చిత్ర ప్రదర్శనకు, ఓ సెలబ్రిటీ పుట్టినరోజు వేడుకలకు హాజరైనట్లు శనివారం కొన్ని దినపత్రికల్లో ఫొటోలు ప్రచురించడంతో ఆమె అనారోగ్యంపై పలు ప్రశ్నలు తలెత్తి వివాదం రేగింది. దీనితో మహారాష్ట్ర హోంమంత్రి ఆర్‌ఆర్‌పాటిల్‌ సంజయ్‌దత్‌కు ఏ ప్రాతిపదికన పెరోల్‌ ఇచ్చారనే అంశంపై విచారణ జరపాలని ఆదేశించారు. పెరోల్‌కు అనుమతి ఇవ్వడానికి దారితీసిన పత్రాలను పరిశీలిస్తామని ఆర్‌ఆర్‌పాటిల్‌ విలేకరులతో చెప్పారు.

    సంజయ్‌దత్‌పట్ల సానుకూలత చూపుతున్నారంటూ రిపబ్లికన్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా (ఆర్పీఐ) ఎరవాడ జైలు ఎదుట ఆందోళనకు దిగింది. నల్లజండాలు ప్రదర్శిస్తూ, పెరోల్‌ రద్దు చేయాలని డిమాండ్‌ చేసింది. దత్‌కు పెరోల్‌ ఇచ్చినా, ప్రత్యేక సదుపాయాలు కల్పించినా మహారాష్ట్రవ్యాప్తంగా జైల్‌భరో నిర్వహిస్తామని ఆర్పీఐ ప్రకటించింది. అధికారులు తమకున్న విచక్షణ అధికారాలను దుర్వినియోగం చేస్తున్నారని ముంబయి వరస పేలుళ్ల కేసులో దోషి పర్వేజ్‌ షేక్‌ న్యాయవాది ఆరోపించారు. పర్వేజ్‌ను కలిసేందుకు తనను అనుమతించడం లేదనీ, సంజయ్‌దత్‌కు మాత్రం పెరోల్‌ ఇచ్చారని విమర్శించారు.

    తాజా వివాదం నేపథ్యంలో సంజయ్‌దత్‌ భార్య మాన్యత కాలేయంలో కణతి, గుండె ఆరోగ్య సమస్య ఉన్నట్లు ఆమెను పరీక్షించిన వైద్యుడు పేర్కొన్నారు. మాన్యతకు కాలేయ సమస్యతోపాటు ఛాతీనొప్పి ఉందనీ, బరువు కూడా తగ్గారనీ, వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించామనీ, వాటి ఫలితాలు వస్తే శస్త్రచికిత్స అవసరమైనదీ, లేనిదీ చెబుతామని డాక్టర్‌ అజయ్‌ ఛాఘులే తెలిపారు. వారం రోజుల క్రితం ఆమె తనను సంప్రదించారనీ, కొన్ని మందులు రాశానని చెప్పారు. గతంలో ఆమె లీలావతి ఆస్పత్రిలో పరీక్షలు చేయించుకున్నారని పేర్కొన్నారు.

    English summary
    A doctor who examined the actor’s wife said she has been diagnosed with a tumor in the liver and a suspected heart ailment. Opposition parties in Maharashtra have accused the State government of preferential treatment in granting a one-month parole to Bollywood actor and 1993 Mumbai blasts convict Sanjay Dutt. The actor was granted parole on Friday on the grounds that his wife Maanyata was unwell and needed to undergo surgery.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X