twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'శిరిడి సాయి'కి కథ ఇవ్వడం నా అదృష్టం

    By Srikanya
    |

    హైదరాబాద్: షిర్డీ సాయిగా నాగార్జున నటించిన శిరిడీ సాయి చిత్రం మొన్న(గురువారం)విడుదల అయిన సంగతి తెలిసిందే. బాబా సచరిత్ర ఆధారంగా రూపొందించిన ఈ చిత్రం మంచి టాక్ తెచ్చుకుంది. ఈ చిత్రానికి పరుచూరి బ్రదర్శ్ తో పాటు భక్త.డి.సురేష్‌కుమార్‌ కూడా సహ రచన చేసారు. ఈ సందర్బంగా... పరుచూరి బ్రదర్శ్ మాట్లాడుతూ.. సబ్‌ కా మాలిక్‌ ఏక్‌..అన్న శిరిడిసాయిని ఆంధ్రజనం తెరపెై చూసి.. సంతోషిస్తున్నారు. వేనోళ్ల కీర్తించబడుతున్న ఈ సినిమాకి కథ అందించిన భక్త డి.సురేష్‌ అభినందనీయుడు అన్నారు.

    భక్త డి.సురేష్‌కుమార్‌ మాట్లాడుతూ '' పదహారు భాషల్లో సాయిపెై సినిమాలు, సీరియళ్లు వచ్చాయి. ఎందరో పరిశోధకులు కొత్త కోణాల్ని ఆవిష్కరించారు. అయినా సాయి గురించి తెలుసుకోవాలనే ఉత్సుకత భక్తుల్లో ఉంటుంది. ఈ సినిమాకి కథ ఇవ్వడం నా అదృష్టం. ఏ రచయితెైనా తొలి చిత్రం విజయమవ్వాలని కలలు కంటాడు. కల ఫలించినపుడు కలిగే ఆనందం వర్ణనాతీతం'' అన్నారు.

    'శిరిడి సాయి' చిత్రాన్ని 801 థియేటర్లలో విడుదలచేసారు. ఆంధ్రప్రదేశ్‌తో పాటు కర్నాటక, సౌత్‌ ఆఫ్రికా, ఆస్ట్రేలియా, కెనడా, జర్మనీ, దుబాయి, న్యూజిలాండ్‌, యు.ఎస్‌. తదిరత ప్రాంతాల్లోకూడా విడుదల చేసారు. చాలా చోట్ల విడుదలకు ముందే థియేటర్లు శుభ్రపరచి, బాబా విగ్రహాలను ఏర్పాటు చేసారు .

    నాగార్జున ఈ చిత్రం గురించి చెబుతూ ''బాబా జననం నుంచి జీవ సమాధి వరకూ ఉన్న అన్ని దశలనూ స్పృశించాం. నేటి తరంలో ఎంతోమంది సాయిబాబా బోధనలపై విశ్వాసం కలిగి ఉన్నారు. అందరికీ నచ్చేలా రాఘవేంద్రరావు ఈ చిత్రాన్ని తీర్చిదిద్దారు. సినిమాకు ఇప్పటికే మంచి స్పందన వచ్చింది''అన్నారు.

    English summary
    Paruchuri Brothers happy with Nagarjuna’s Shirdi Sai which is released grandly worldwide last wednesday. Producer A. Mahesh Reddy has released the movie in 801 theatres.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X