»   »  బెజవాడ రైల్వే స్టేషన్లో వెయిట్ మిషన్ మీద నిలబడితే..... పరుచూరి గోపాల కృష్ణ

బెజవాడ రైల్వే స్టేషన్లో వెయిట్ మిషన్ మీద నిలబడితే..... పరుచూరి గోపాల కృష్ణ

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
Subscribe Now
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  బాహుబలి, బజ్‌రంగీ భాయిజాన్ చిత్రాల కథారచయిత విజయేంద్రప్రసాద్ దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం శ్రీవల్లీ. రజత్, నేహాహింగే జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని రేష్మాస్ ఆర్ట్స్ పతాకంపై రాజ్‌కుమార్ బృందావనం నిర్మిస్తున్నారు. జనవరి 23న చిత్ర పాటలను విడుదలచేసారు.

  ఈ ఆడియో వేడుకకు ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి ముఖ్య అతిథిగా అయ్యారు. ఇదే సభకి వచ్చిన రచయిత పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ.. ''విజయేంద్రప్రసాద్‌ మనసుపై కథతో ఈ సినిమాని తీశారు. తనయుడు రాజమౌళి ఆకాశంలో ఉన్నారు, ఆయనతో పోటీపడుతున్నందుకు విజయేంద్రప్రసాద్‌ని అభినందించాలి. కొడుకుమీద గెలవడానికి ప్రయత్నిస్తున్న విజయేంద్రప్రసాద్‌ కోరిక తీరాలని ఆకాంక్షిస్తున్నా' అంటూ మాట్లాడిన ఆయన తాను సినిమాల్లోకి వచ్చీనప్పుడు జరిగిన కొన్ని సంఘటనలని గుర్తు చేసుకున్నారు.

  Paruchuri Gopala Krishna

  'నేను ఒక కాలేజీలో వైస్ ప్రిన్సిపాల్‌గా పని చేసేవాడిని. కానీ సినిమాలపై ఆసక్తి ఉండేది. మద్రాసు వెళ్లి అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకునే వాడిని. అప్పుడప్పుడూ ప్రయత్నాలు చేసి విఫలమయ్యాను. చివరగా ఒకసారి మద్రాసు వెళ్లి వద్దామనుకున్నా. కానీ మా ఆవిడ ఇన్నాళ్లు తిరిగారు ఏమైనా సంపాదించారా అని అడిగింది. మద్రాసు వెళ్లొద్దని పట్టుబట్టింది. ఐతే అప్పుడు ఆమెకో మాట చెప్పాను.

  నవంబరు 1న వెళ్తున్నా. డిసెంబరు 1న వస్తాను. ఈ నెల రోజుల్లో కాలేజీలో నేను అందుకునే 1100 రూపాయల జీతాన్ని సినిమాల్లోనే సంపాదించుకుని తిరిగొస్తాను. అలా వచ్చానంటే సినిమాల్లో కొనసాగుతాను. లేదంటే మళ్లీ అటు వైపు వెళ్లను అని చెప్పి వెళ్లాను.

  బెజవాడ రైల్వే స్టేషన్లో వెయిట్ మిషన్ మీద నిలబడితే.. అందులోంచి ఒక కార్డు ముక్క వచ్చింది. దాని వెనుక మీకో ద్వారం మూసుకుంటే.. ఇంకో ద్వారం తెరుచుకుంటుంది అని రాసి ఉంది. లెక్చరర్‌గా నా ప్రస్థానం ముగిసి.. సినీ ప్రస్థానం మొదలవబోతోందని అనుకున్నా. మద్రాసు వెళ్లి నెల తిరిగాక వెనక్కి వచ్చా. మా అమ్మాయి నా పెట్టె తెరిచి చూస్తే అందులో 11 వేలున్నాయి. నా 11 నెలల జీతాన్ని ఒకే నెలలో సంపాదించుకుని వచ్చాను'' అని పరుచూరి వెల్లడించారు.

  English summary
  "I had to test my fate in Chennai after applying for leave at the college where I was a lecturer. I happened to check my weight at a bus stand on my way to Chennai. I don't know how it happened, but the weighing machine said that if one door closes on me, another one opens. Vijayendra Prasad has risked it by making a film on psychology. When we wanted to direct, NT Rama Rao garu suggested us not to do" said aruchuri Gopalakrishna
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more