»   » ఎన్టీఆర్ మాటతో రచయిత కళ్ళల్లో నీళ్లు తిరిగాయి..అతడి హృదయం పిండేశాడు!

ఎన్టీఆర్ మాటతో రచయిత కళ్ళల్లో నీళ్లు తిరిగాయి..అతడి హృదయం పిండేశాడు!

Subscribe to Filmibeat Telugu

పరుచూరి పలుకులు పేరుతో సీనియర్ రచయిత పరుచూరి గోపాలకృష్ణ సోషల్ మీడియాలో తన అభిప్రాయాలని పంచుకుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ గురించి పరుచూరి ప్రస్తావించారు. ఆది సినిమా సంగతులని పరుచూరి అభిమనులతో పంచుకున్నారు.

ఆది చిత్రం షూటింగ్ పూర్తయ్యాక ఎన్టీఆర్ రషెష్ చూసాడు. ఆ తరువాత ప్రెస్ మీట్ జరిగింది. ఆ ప్రెస్ మీట్ లో ఎన్టీఆర్ అన్న మాట నా కళ్ళలో నీళ్లు తిరిగేలా చేసిందని తెలిపాడు.

Paruchuri Gopala Krishna emotional comments on Jr NTR

ఆది చిత్రాన్ని వినాయక్ ఎంత గొప్పగా తీశారో అంతే గొప్పగా ఎన్టీఆర్ నటించాడు అని పరుచూరి అన్నారు. ప్రెస్ మీట్ లో ఎన్టీఆర్ మాట్లాడుతూ నన్ను పక్కకు పిలిచారు. ఎన్టీఆర్ వైపుగా వెళ్ళాను. మిమ్మల్ని బాబాయ్ అని పిలవచ్చా అని ఎన్టీఆర్ అడిగాడు.

ఆ మాటతో నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి అని పరుచూరి అన్నారు. మీ తాత గారు, నాన్నగారు, బాబాయ్ అంతా నాకు సోదరులు లాంటి వారు. నీవి నన్ను బాబాయ్ అని పిలవచ్చు అని తాను ఎన్టీఆర్ తో అన్నట్లు పరుచూరి గుర్తు చేసుకున్నారు. ఆది చిత్రం ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే.

English summary
Paruchuri Gopala Krishna emotional comments on Jr NTR. He remembers Aadi movie
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu