twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కేంద్ర ప్రభత్వం కంగారుపడేలా 'ఎన్టీఆర్'.. సినిమా చరిత్ర ఉన్నంతవరకు ఆ రెండు పాటలు!

    |

    మహానటుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ఎన్టీఆర్ బయోపిక్ చిత్రానికి సంబంధించిన ప్రీ రీలీజ్ ఈవెంట్ కనివీని ఎరుగని రీతిలో నిర్వహించారు. సినీ రంగానికి చెందిన ప్రముఖుంలా ఈ వేడుకకు హాజరయ్యారు. సూపర్ స్టార్ కృష్ణ, మోహన్ బాబు లాంటి ప్రముఖ నటులు ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు ఆడియో వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సూపర్ స్టార్ కృష్ణ, కృష్ణం రాజు, రాఘవేంద్ర రావు లాంటి సినీ దిగ్గజాలు ఈ ఆడియో వేడుకకు అతిథులుగా హాజరు కావడం విశేషం. రాఘవేంద్ర రావు, రచయిత పరుచూరి గోపాల కృష్ణ ఆడియోవేడుకలో తమ ప్రసంగంతో ఆకట్టుకున్నారు.

    కేంద్ర ప్రభత్వం కంగారుపడేలా

    కేంద్ర ప్రభత్వం కంగారుపడేలా

    ఎన్టీఆర్ బయోపిక్ చిత్రం కేంద్రప్రభుత్వం కంగారుపడేలా ఉండబోతోందని పరుచూరి గోపాల కృష్ణ అన్నారు. మీ మీరంతా పుట్టకముందు నుంచే తాను నందమూరి అభిమానిని. ఆయనతో నాకు ఎన్నో మధురమైన అనుభూతులు ఉన్నాయి. ఈ చిత్రం విడుదలయ్యాక ఎన్టీఆర్ లాంటి గొప్ప వ్యక్తికి ఇంకా భారత రత్న ఎందుకు ఇవ్వలేదు అని కేంద్ర ప్రభుత్వం కంగారు పడుతుందని పరుచూరి తెలిపారు.

    అది అబద్దం, నాకు పిచ్చి అనుకోవచ్చు... తెలుగోడి దెబ్బ చూపించే సమయం: బాలయ్య పవర్‌ఫుల్ స్పీచ్ అది అబద్దం, నాకు పిచ్చి అనుకోవచ్చు... తెలుగోడి దెబ్బ చూపించే సమయం: బాలయ్య పవర్‌ఫుల్ స్పీచ్

    చండశాసనుడు

    చండశాసనుడు

    తాను ఎన్టీఆర్ కు చండశాసనుడు చిత్ర కథ వినిపించడానికి వెళ్ళా. ఏం బ్రదర్ ఎలా రాశారు. బాగా రాసాను అన్నగారు. ఇంటర్వెల్ సన్నివేశం చెప్పండి. కొంచెం సీన్ చెప్పగానే.. ఇక ఆపండి. అన్నం ఉడికిందా లేదని తెలుసుకోవడానికి ఒక మెతుకుని ముట్టుకుంటే చాలు బ్రదర్.. చాలా బావుంది అని అన్నారు. అలాంటి గొప్ప వ్యక్తి, తండ్రి పాత్రలో బాలయ్య ఒదిగిపోయాడు అని పరుచూరి తెలిపారు.

    అదృష్టం ఉండాలి

    అదృష్టం ఉండాలి


    రాఘవేంద్ర రావు మాట్లాడుతూ.. ఎన్టీఆర్ లాంటి గొప్ప వ్యక్తితో పని చేయాలి అంటే ఎన్నో జన్మల అదృష్టం ఉండాలి. నేను ఆయనతో 12 సినిమాలు చేశాను. కాబట్టి ఎన్టీఆర్ బయోపిక్ చిత్రాన్ని తాను 12 సార్లు చూస్తానని రాఘవేంద్ర రావు అన్నారు. రాఘవేంద్ర రావు, ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చిన అడవిరాముడు, వేటగాడు, మేజర్ చంద్రకాంత్ లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాలు వచ్చాయి.

    ఆ రెండు పాటలు

    ఆ రెండు పాటలు

    అడవి రాముడు చిత్రంలోని కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు అనే పాట, మేజర్ చంద్రకాంత్ చిత్రంలోని పుణ్యభూమి నాదేశం పాట సినిమా చరిత్ర ఉన్నంత వరకు ఉంటాయని రాఘవేంద్ర రావు అన్నారు. తాను అప్పట్లో కొత్త ఇల్లు కట్టుకున్న సందర్భంగా ఆ పుణ్యదంపతులు ఇద్దరూ గృహప్రవేశానికి వచ్చి తనని ఆశీర్వదించారు అని రాఘవేంద్ర రావు అన్నారు.

    English summary
    Paruchuri Gopalakrishna and Raghavendra Rao Speech at NTR Biopic Audio Launch
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X