»   » రాణాని ఎరేసి వెంకటేష్ ని పట్టారు

రాణాని ఎరేసి వెంకటేష్ ని పట్టారు

Posted By:
Subscribe to Filmibeat Telugu

వెంకటేష్ డేట్స్ కోసం ఓ చిత్రమైన వ్యూహాన్ని సింహా నిర్మాతలు అవలంబించారని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది.చాలా కాలంగా వెంకటేష్ డేట్స్ కోసం తిరుగుతున్న వారికి కథ నచ్చలేదనో,డైరక్టర్ నచ్చలేదనో,డేట్స్ ఖాళీ లేవనో మాటలు ఎదురవ్వుతున్నాయి.దాంతో వారు వెంకటేష్ అన్న కుమారుడు దగ్గుపాటి రాణా ని హీరోగా పెట్టి నా ఇష్టం సినిమాని ప్రారంభించి వెంకటేష్ ని డేట్స్ కోసం పంప్రదించారు.వెంటనే వెంకటేష్ మారు మాట్లాడకుండా ప్యాకేజి మాదిరిలో డేట్స్ ఇచ్చేసాడు. ఈ చిత్రానికి మిస్టర్ ఫెరఫెక్ట్ తో హిట్ కొట్టిన దశరధ్ దర్శకత్వం వహిస్తూంటే కోన వెంకట్ స్క్రిప్టు అందించనున్నారు.ప్రస్తుతం కోన వెంకట్,దశరధ్ స్క్రిప్టు వర్క్ లో బిజీగా ఉన్నారు.

వచ్చే సంక్రాంతికి విడుదల అయ్యేలా షూటింగ్ ప్లాన్ చేసుకుంటున్నారని తెలుస్తోంది.ఇక వెంకటేష్ ప్రస్తుతం బాడీగార్డు రీమేక్ లో బిజీగా ఉన్నారు.త్రిష హీరోయిన్ గా చేస్తున్న ఆ చిత్రాన్ని గోపీచంద్ మలినేని డైరక్ట్ చేస్తున్నారు. అలాగే సింహా నిర్మాతలు రాణా హీరోగా నా ఇష్టం చిత్రం నిర్మిస్తున్నారు. సుకుమార్ అశోశియేట్ ప్రకాష్ తోలేటి ని దర్శకుడుగా పరిచయం చేస్తూ ఆ చిత్రం రూపొందనుంది. జెనీలియా హీరోయిన్ గా చేస్తున్న ఆ చిత్రం షూటింగ్ ప్రస్తుతం మలేషియాలో షూటింగ్ పూర్తి చేసుకు వచ్చింది.

English summary
Paruchuri Kiriti will soon produce a film with Venkatesh in the lead role to be directed by Dasarath. Venky has given his nod recently after Dasarath has narrated the storyline.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu