»   » పార్వతి మిల్టన్ ఇప్పుడే సినిమా చేస్తోంది?

పార్వతి మిల్టన్ ఇప్పుడే సినిమా చేస్తోంది?

Posted By:
Subscribe to Filmibeat Telugu

పవన్ కళ్యాణ్ జల్సా చిత్రంతో ఫుల్ బిజీ అవుతుందనుకున్న పార్వతి మిల్టన్ తర్వాత ఎడ్రస్ లేకుండా మాయమైంది. మహేష్ సినిమాలో ఆఫర్ ఇస్తానన్న త్రివిక్రమ్ హ్యాండివ్వటంతో ఆమె అలిగి కొంతకాలం విదేశాలకు వెళ్ళింది. వచ్చే చూసే సరికి ఆమెను సినిమాల్లో తీసుకునేవారు కనపడలేదు. అయితే ప్రస్తుతం ఆమె 'మిలారి' అనే ఓ కన్నడ సినిమా ఒప్పుకుంది. అస్సలు ఏమీ లేకుండా ఖాళీగా ఉండటం కన్నా ఏదో ఒకటి చేస్తూ మళ్ళీ పెద్ద సినిమాలు ట్రై చేయటం మేలని ఆమె శ్రేయాభిలాషుల సలహా మేరకు ఆమె ఈ నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. కన్నడ సూపర్ స్టార్ శివరాజకుమార్ హీరోగా చేసే ఈ చిత్రాన్ని విజయ్ అనే దర్శకుడు డైరక్ట్ చేస్తున్నాడు. ఇందులో సదా కూడా ఓ కీలకమైన పాత్ర పోషిస్తోంది. మార్చి 25న చిత్రం ప్రారంభం అవుతోంది. ఇక ఇప్పటికే నయనతార అక్కడ స్టార్ హీర ఉపేంద్ర సరసన సినిమా చేస్తున్నారు. అది కూడా పార్వతి మిల్టన్ ఒప్పుకోవటానికి ఓ కారణం అంటున్నారు. అలాగే ఆమె మరో ప్రక్క బాలీవుడ్ ఆఫర్స్ కోసం కూడా ప్రయత్నాలు చేస్తున్నట్లు వినపడుతోంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu