»   » నన్ను కూడా పడుకోమన్నారు: హీరోయిన్ సంచలన కామెంట్స్

నన్ను కూడా పడుకోమన్నారు: హీరోయిన్ సంచలన కామెంట్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సినిమా ఇండస్ట్రీలోని చీకటి కోణం కాస్టింగ్ కౌచ్. తమతో సెక్స్ కు అంగీకరిస్తేనే అవకాశాలిస్తాం అనే ఒక నీచమైన సాంప్రదాయం. ఈ వ్యవహారానికి సంబంధించిన వాస్తవాలను ఇటీవల కాలంలో పలువురు హీరోయిన్లు నిర్భయంగా మీడియాకు వెల్లడిస్తున్నారు. తాజాగా ఈ లిస్టులో సౌత్(మళయాలం) హీరోయిన్ పార్వతి కూడా చేరారు.

పడక గదికి రమ్మని ఒత్తిడి

పడక గదికి రమ్మని ఒత్తిడి

సినిమా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత తాను కూడా కాస్టింగ్ కౌచ్ ఇలాంటివి ఎదుర్కొన్నాను. కొందరు దర్శకులు, హీరోలు తమతో పడుకోవాలని, అలా అయితేనే అవకాశాలిస్తామని ఒత్తిడి తెచ్చారని ఆమె ఇటీవల ఇంటర్వ్యూలో వెల్లడించారు.

నిజమే

నిజమే

కాస్టింగ్ కౌచ్ అనేది సినీ ఇండస్ట్రీలో బాగా విస్తరించింది. నటిగా ఎదగాలని ఇండస్ట్రీకి వచ్చే వారిని బలహీనతలను, అవకాశాలు లేని వారి నిస్సహాయతను అడ్డు పెట్టుకుని ఈ నీచపు పని చేసేలా ఒత్తిడి తెస్తారు అని పార్వతి తెలిపారు.

ఓ హీరో, దర్శకుడు

ఓ హీరో, దర్శకుడు

మళయాల పరిశ్రమలో ఓ హీరో, ఓ దర్శకుడు తనను గతంలో ఇలానే తమతో పడుకోవాలని ఒత్తిడి తెచ్చారు. అయితే తాను అందుకు ఒప్పుకోలేదు. ఇలాంటి చేసేకన్నా అవకాశాలు వదులుకోవడానికి సిద్ధమే అని తేల్చి చెప్పాను అని పార్వతి తెలిపారు.

ఇదంతా మామలే అంటూ...

ఇదంతా మామలే అంటూ...

మనం ఒప్పుకోక పోతే ఇండస్ట్రీలో ఇదంతా మామూలే... లేకుంటే నువ్వు నటిగా ఎదగలేవు.... ఇలాంటి వాటికి సిద్ధమైనపుడే నీ కెరీర్ బావుంటుంది అంటూ మీడియేటర్ల ద్వారా తమను ఒప్పించే ప్రయత్నం చేస్తారని పార్వతి మీనన్ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

పార్వతి మీనన్

పార్వతి మీనన్

కేరళలో పుట్టి పెరిగిన పార్వతి మీనన్... 2006 మళయాలంలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. మళయాలంతో పాటు తమిళ చిత్రాల్లో నటించింది. మళయాలంలో వచ్చిన బెంగుళూరు డేస్ ఆమెకు బాగా పేరు తెచ్చింది. తమిళంలో ధనుష్ తో ఆమె నటించిన మారియన్ తెలుగులోనూ రిలీజైంది.

Read more about: tollywood, mollywood, parvathy
English summary
Malayalam actress Parvathy Menon has said something similar about her home industry, Mollywood. “There are people in the industry who ask women to sleep with them in order to get a role. I have been asked. They ask very blatantly as if it is their right. I have said NO. After a point, when you have made a mark in the industry, they won’t ask you,” Parvathy said.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu