For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  కళ్యాణ్ రామ్ యువసేన: ‘పటాస్’ బెనిపిట్ షో

  By Bojja Kumar
  |

  హైదరాబాద్: కళ్యాణ్ రామ్ నటించిన ‘పటాస్' చిత్రం రేపు విడుదలవుతున్న సంగతి తెలిసిందే. గతంలో ఎన్నడూ లేని విధంగా కళ్యాణ్ రామ్ నటించిన ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. సినిమా విడుదలకు ముందే పాజిటివ్ టాక్ స్ప్రెడ్ అయింది. సినిమా పోస్టర్లు, ట్రైలర్ ఆకట్టుకునే విధంగా ఉండటమే ఇందుకు కారణం. తమ్మడు జూ ఎన్టీఆర్ కూడా అన్నయ్య సినిమాకు ప్రచారం చేసారు. రేపు ఉదయం పలు చోట్ల బెనిఫిట్ షోలు కూడా వేస్తున్నారు. హైదరాబాద్ లోని కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు ఏరియాలోని భ్రమరాంబ థియేటర్లో ఉదయం 7 గంటలకు బెనిఫిట్ షో వేస్తున్నారు. కళ్యాణ్ రామ్ యువ సేన వారు చారిటీ కోసం ఈ షో ఆర్గనైజ్ చేస్తున్నారు. టిక్కెట్ల కోసం రఘు అనే వ్యక్తిని 9393459999, 9966655513 ద్వారా సంప్రదించవచ్చు.

  ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

  Pataas benefit show details

  కల్యాణ్‌రామ్‌ హీరోగా నటిస్తూ నిర్మించిన చిత్రం 'పటాస్‌'. శ్రుతి సోడి హీరోయిన్. అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహించారు. సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం....ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ ఓ అవినీతి పోలీస్ అథికారిగా కనిపిస్తారు. అలాగే తన చేష్టలతో తన తండ్రి సీనియర్ పోలీస్ అధికారి(సాయికుమార్)ని ఇబ్బంది పెడుతూంటాడు. తండ్రికి, డుకు కు మధ్యన పొసగదు. తండ్రి తనను పట్టించుకోకుండా, తన ఇష్టా ఇష్టాలతో సంభంధం లేకుండా పోలీస్ ను చేసాడని మనస్సులో పెట్టుకుని ఆ కసితో తండ్రికి బ్యాడ్ నేమ్ తెచ్చేలా బిహేవ్ చేస్తూంటాడు. అంతేకాకుండా విలన్స్ దగ్గర డబ్బు తీసుకుని వారికి సాయిం చేస్తూంటాడు. మరో ప్రక్క హీరోయిన్ ఓ జర్నలిస్ట్. ఆమెపై మనస్సు పడి ఏదో ఓ ప్రెస్ మీట్ పెట్టి ఆమెను పిలుస్తూంటాడు. చివరకు అతను ఓ సంఘటన వల్ల మారి..సెకండాఫ్ లో విలన్స్ భరతం పడతాడు. తన తండ్రితో ఉన్న రిలేషన్ ని పునరిద్దించుకుంటాడు. సెకండాఫ్ లో కూడా కామెడీకి మంచి ప్రయారిటీ ఇచ్చారని తెలుస్తోంది. ఇది కళ్యాణ్ రామ్ కు గబ్బర్ సింగ్ అంటున్నారు.స

  ఇక ఈ చిత్రం ఫస్టాఫ్ పూర్తి ఫన్ తో నడుస్తుంది. కామెడీకు ప్రయారిటీ ఇస్తూ, పంచ్ డైలాగులతో సినిమా వెళ్లిపోతుంది. సెకండాఫ్ లో సూర్య సింగం స్టైల్ లో విలన్స్, హీరోకి మధ్య వార్ తో ఎత్తుకు పై ఎత్తులతో పరుగెడుతుంది. అందిన ప్రాధమిక సమాచారం ప్రకారం..సినిమా సక్సెస్ అవుతుందని తెలుస్తోంది. మాస్, క్లాస్ అనే తేడా లేకుండా అందరినీ ఆకట్టుకుంటుందని చెప్తున్నారు.

  ''స్వతహాగా రచయితనే అయినా ఈ సినిమా విషయంలో నాలోని దర్శకుడి ఆధిపత్యమే ఎక్కువగా కనిపిస్తుంది. సినిమాకి ఏమేం అవసరమో అది మాత్రమే చేశా. సంభాషణలు రాశాను కదా అని ఏది పడితే అది తీయలేదు. ఆరేడేళ్లు దర్శకత్వ విభాగంలో పనిచేశాను కాబట్టి ఆ అనుభవం బాగా ఉపయోగపడింది'' అంటన్నారు దర్శకుడు అనీల్ రావిపూడి. రచయితగా పలు చిత్రాలకి పనిచేసిన ఆయన 'పటాస్‌'తో మెగాఫోన్‌ చేపట్టారు.

  సాయికుమార్‌, బ్రహ్మానందం, అశుతోష్‌ రాణా, ఎమ్మెస్‌ నారాయణ, శ్రీనివాసరెడ్డి, జయప్రకాశ్‌రెడ్డి, పోసాని కృష్ణమురళి తదితరులు నటించిన ఈ చిత్రానికి ఫొటోగ్రఫీ: సర్వేశ్‌ మురారి, ఎడిటింగ్‌: తమ్మిరాజు, రచనా సహకారం: ఎస్‌.కృష్ణ, నిర్మాత: నందమూరి కల్యాణ్‌రామ్‌, కథ, మాటలు, స్ర్కీన్‌ప్లే, దర్శకత్వం: అనిల్‌ రావిపూడి.

  English summary
  Kalyan Ram Yuvasena (KPHB) are going to hold a special charity show of PATAAS on January 23rd. The show will start at 7 AM at Bramarambha theatre, Kukatpally Housing Board. Kalyan Ram, director Anil Ravipudi and other team members will attend the event along with some other celebrities.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X