Just In
- 5 hrs ago
అందుకే ఆ టైటిల్ పెట్టాం.. ‘చెప్పినా ఎవరూ నమ్మరు’పై హీరో కమ్ డైరెక్టర్ కామెంట్స్
- 5 hrs ago
పబ్లిక్ ప్లేస్‌లో ఘాటు ముద్దులు.. లిప్ కిస్‌తో భర్తతో శ్రియ రచ్చ
- 6 hrs ago
మళ్లీ రాజకీయాల్లోకి చిరంజీవి.. పవన్ కల్యాణ్‌కు అండగా మెగాస్టార్.. జనసేన నేత సంచలన ప్రకటన!
- 6 hrs ago
శ్రీను వైట్ల ఓ శాడిస్ట్.. మంచు విష్ణు సెన్సేషనల్ కామెంట్స్
Don't Miss!
- News
కూరగాయాలకు మద్దతు ధర, సీఎం కేసీఆర్ స్పష్టీకరణ..?
- Finance
ఆల్ టైమ్ గరిష్టంతో రూ.7300 తక్కువకు బంగారం, ఫెడ్ పాలసీకి ముందు రూ.49,000 దిగువకు
- Sports
ఆ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి.. కమిన్స్‌ను మూడు ఫార్మాట్లకు కెప్టెన్‌ను చేయండి: క్లార్క్
- Automobiles
స్విఫ్ట్, బాలెనో, ఐ20 వంటి మోడళ్లకు వణుకు పుట్టిస్తున్న టాటా ఆల్ట్రోజ్
- Lifestyle
Study : గాలి కాలుష్యం వల్ల అబార్షన్లు పెరిగే ప్రమాదముందట...! బీకేర్ ఫుల్ లేడీస్...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
‘పటాస్’ రిలీజ్ డేట్ ఖరారైంది(అఫీషియల్)
హైదరాబాద్: నందమూరి కల్యాణ్.. పవర్‌ఫుల్ పోలీసాఫీసర్ పాత్రలో తెరకెక్కిన చిత్రం 'పటాస్'. సొంత బ్యానర్ నందమూరి తారకరామారావు ఆర్ట్స్ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఆయనే నిర్మాత. అనిల్ రావిపూడి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ చిత్ర ఆడియో, ట్రైలర్ ఇటీవల విడుదల చేసారు. పాటకుల మంచి రెస్పాన్స్ వస్తోంది.
రొమాంటిక్ , యాక్షన్, మాస్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం రూపుదిద్దుకొంది. సాయికార్తీక్ మంచి సంగీతాన్ని అందించారు. ఈ చిత్రాన్ని జనవరి 23న విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు యూనిట్ సభ్యులు ఒక ప్రకటనలో తెలిపారు.

కల్యాణ్‌రామ్ మాట్లాడుతూ ''యాక్షన్ ప్రధానంగా సాగే చిత్రమిది. కథలో వినోదానికీ చోటుంది. భారీ హంగులతో రూపుదిద్దుకొంటున్న ఈ చిత్రం ఇంటిల్లిపాదినీ అలరిస్తుంది'' అన్నారు. శ్రుతి సోధి పంజాబీ చిత్రాల్లో నటించి పేరు తెచ్చుకొంది శ్రుతి. అటు అందంగా కనిపించడంతోపాటు ఇటు నటనలోనూ రాణిస్తోంది. చిత్రంలో కల్యాణ్‌రామ్ పోలీసు అధికారిగా కనిపిస్తారు. కథలో మలుపులు రక్తికట్టించేలా ఉంటాయని చిత్రబృందం చెబుతోంది.
సాయికుమార్, బ్రహ్మానందం, అశుతోష్ రాణా, ఎమ్మెస్ నారాయణ, శ్రీనివాసరెడ్డి, జయప్రకాశ్‌రెడ్డి, పోసాని కృష్ణమురళి తదితరులు నటించిన ఈ చిత్రానికి ఫొటోగ్రఫీ: సర్వేశ్ మురారి, ఎడిటింగ్: తమ్మిరాజు, రచనా సహకారం: ఎస్.కృష్ణ, నిర్మాత: నందమూరి కల్యాణ్‌రామ్, కథ, మాటలు, స్ర్కీన్‌ప్లే, దర్శకత్వం: అనిల్ రావిపూడి.