»   » షాకింగ్: ‘పటాస్’ శాటిలైట్ రైట్స్ భారీ ధరకు

షాకింగ్: ‘పటాస్’ శాటిలైట్ రైట్స్ భారీ ధరకు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: కళ్యాణ్ రామ్ హీరోగా, అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ‘పటాస్' మూవీ కలెక్షన్ పరంగా అదరగొడుతున్న సంగతి తెలిసిందే. కళ్యాణ్ రామ్ నటించిన గత సినిమాలతో పోలిస్తే ఈ సినిమాకు కలెక్షన్లు చాలా ఎక్కువగా ఉన్నాయి. మరో వైపు ఈచిత్రం శాటిలైట్ రైట్స్ కూడా భారీ ధరకు అమ్ముడు పోయాయి. ఓ లీడింగ్ ఛానల్ ఈ చిత్రం శాటిలైట్ రైట్స్ రూ. 4 కోట్లకు కొనుగోలు చేసింది. కళ్యాణ్ రామ్ సినిమాకు ఇంత రావడం అంటే షాకే మరి.

మరో వైపు ఈచిత్రం బాక్సాఫీసు వద్ద 10 రోజులు పూర్తి చేసుకుంది. పెట్టుబడి, మార్కెటింగ్ ఖర్చులు పోను ఇప్పటి వరకు రూ. 3 కోట్ల లాభం వచ్చినట్లు తెలుస్తోంది. ‘పటాస్' చిత్రం విజయంతో ఉత్సాహంగా ఉన్నకళ్యాణ్ రామ్ విజయోత్సవ ర్యాలీలు ప్రారంభించాడు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంచి కథ దొరికితే మల్టీస్టారర్ చిత్రాలు చేయడానికి సిద్ధమే అని, బాబాయ్ బాలయ్య, తమ్ముడు ఎన్టీఆర్‌తో కలిసి నటించడానికి ఎలాంటి అభ్యంతరం లేదని తెలిపారు.


ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


Patas satellite rights sold for a bomb

అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ‘పటాస్' మూవీ విడుదల రోజు నుండే మౌత్ టాక్ బావుండటం, రివ్యూలు కూడా అనుకూలంగా రావడంతో కళ్యాణ్ రామ్ కెరీర్లోనే ఈ చిత్రం బిగ్గెస్ట్ హిట్ చిత్రంగా నిలిచింది. తాజాగా ఈ చిత్రం ఫస్ట్ వీక్ కలెక్షన్ల విషయంలో సత్తా చాటింది. కళ్యాణ్ రామ్ కెరీర్లో గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ చిత్రం తొలివారం వరల్డ్ వైడ్ రూ. 13 కోట్లకుపైగా వసూలు చేసినట్లు తెలుస్తోంది.


సాయికుమార్‌, బ్రహ్మానందం, అశుతోష్‌ రాణా, ఎమ్మెస్‌ నారాయణ, శ్రీనివాసరెడ్డి, జయప్రకాశ్‌రెడ్డి, పోసాని కృష్ణమురళి తదితరులు నటించిన ఈ చిత్రానికి ఫొటోగ్రఫీ: సర్వేశ్‌ మురారి, ఎడిటింగ్‌: తమ్మిరాజు, రచనా సహకారం: ఎస్‌.కృష్ణ, నిర్మాత: నందమూరి కల్యాణ్‌రామ్‌, కథ, మాటలు, స్ర్కీన్‌ప్లే, దర్శకత్వం: అనిల్‌ రావిపూడి.

English summary
According to the latest update, Patas satellite rights of the film have been sold for a whopping 4 crores to a leading television channel.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu