»   » మైండ్ బ్లోయింగ్ అంటే ఇదే: పటేల్‌సర్ గా జగ్గూభాయ్ ఫస్ట్‌లుక్

మైండ్ బ్లోయింగ్ అంటే ఇదే: పటేల్‌సర్ గా జగ్గూభాయ్ ఫస్ట్‌లుక్

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఫ్యామిలీ హీరో గా ఒక వెలుగు వెలిగి హీరోగా కెరియర్ ఎండింగ్ కు వచ్చిందని అనిపించుకున్న జగపతి బాబు సడెన్ గా విలన్ గా టర్న్ తీసుకుని కొత్త కెరియర్ స్టార్ట్ చేశాడు. విలన్ గా, సపోర్టెడ్ ఆర్టిస్ట్ గా జగపతి బాబు భాషతో సంబంధం లేకుండా తెగ బిజీ అయిపోయాడు. హీరోగా చేసిన దానికన్నా ఇప్పుడే సూపర్ సక్సెస్ ఫుల్ గా ఉన్నానని చాలా సార్లు చెప్పాడు కూడా.

జగపతి బాబు

జగపతి బాబు

దర్శకుడు బోయపాటి శ్రీను జగపతి బాబు విలన్ గా లెజెండ్ సినిమాతో మళ్ళీ పరిచయం చేశాడు. దాంతో జగపతి కెరీర్ ఒక్కసారిగా ఊపందుకుంది. విలన్ గా టర్న్ తీసుకున్న తర్వాత జగపతి బాబుని ఫాలో అయ్యే వారి సంఖ్య పెరిగింది. అటుతమిళ్ లో కూడా విలన్ గా అవకాశాలు వస్తున్నాయి.


జగపతిబాబు ఫస్ట్ లుక్

జగపతిబాబు ఫస్ట్ లుక్

ఈ సెకండ్ ఇన్నింగ్స్ లో తాజాగా జగపతి హీరోగా మళ్ళీ తన మార్క్ చూపించే ప్రయత్నం చేస్తున్నాడు.షూటింగ్ ప్రారంభించిన రోజే సినిమా థీమ్ తో ఓ టీజర్ ను రిలీజ్ చేసిన చిత్రయూనిట్ తాజాగా జగపతిబాబు ఫస్ట్ లుక్ ను రివీల్ చేశారు. డిఫరెంట్ మేకోవర్ లో జగపతి బాబు టఫ్ అండ్ స్టైలిష్ గా కనిపిస్తున్నాడు.


పటేల్ సార్

పటేల్ సార్

వాసు పరిమి డైరక్షన్లో పటేల్ సార్ అనే సినిమాతో వస్తున్నాడు జగ్గు భాయ్. సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ సాయి కొర్రపాటి నిర్మిస్తున్న ఈ సినిమా ఎప్పుడు స్టార్ట్ అయ్యిందో తెలియదు కాని రీసెంట్ గా రిలీజ్ అయిన టీజర్ యూట్యూబ్ ట్రెండింగ్ లో నడుస్తుంది. జగపతి బాబు లుక్.. ప్రెజెంటేషన్.. బాడీ ప్రధాన ఆకర్షణగా వస్తున్న ఈ పటేల్ సార్ టీజర్ రెండు రోజుల్లో 12 లక్షల వ్యూయర్ కౌంట్ సాధించింది.


యాక్షన్ థ్రిల్లర్ కథాంశం

యాక్షన్ థ్రిల్లర్ కథాంశం

ఈ సినిమాకి జగపతిబాబు కూడా ఒక నిర్మాతగా వ్యవహరించనున్నాడు. సాయికొర్రపాటి చిత్ర విశేషాలు తెలియజేస్తూ యాక్షన్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కుతున్న చిత్రమిది. వృద్ధుడిగా జగపతిబాబు పాత్ర నవ్యరీతిలో సాగుతుంది. గత చిత్రాలకు భిన్నంగా వైవిధ్యమైన లుక్‌తో ఆయన కనిపించబోతున్నారు.


కంటికి కనిపించని శత్రువుపై

కంటికి కనిపించని శత్రువుపై

వృద్ధుడికి, చిన్నారికి మధ్య ఉండే అనుబంధం నేపథ్యంలో సాగుతుంది. కంటికి కనిపించని శత్రువుపై పోరాడే పటేల్ సార్ కథ ఇది. అతడి వేట ఎవరి కోసం అనేది సినిమాలో ఆసక్తిని పంచుతుంది. ముహూర్తం రోజునే చిత్ర టీజర్‌ను విడుదలచేశాం. త్వరలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం అని తెలిపారు.


సాయి కొర్రపాటి

సాయి కొర్రపాటి

వాస్తవానికి ఈ సినిమాను కన్నడ నిర్మాత కుమారస్వామి నిర్మిస్తాడని గతంలో జగపతి బాబు చెప్పినా.. సాయి కొర్రపాటి నిర్మిస్తున్నాడిప్పుడు. మరి, జగపతి బాబును ఈ రేంజ్ స్టైల్‌గా, ట్రెండీగా జగపతిబాబులోని మరో కోణాన్ని ఆవిష్కరించబోతున్న ఆ కొత్త డైరెక్టర్ వాసు పరిమి. టీజర్‌తో అటు డైరెక్టర్, ఇటు జగపతి బాబు అలరించారు. మరి, సినిమాలో వారి పెర్ఫార్మెన్స్ ఏ రేంజ్‌లో ఉంటుందో చూడాలంటే మరి కొన్ని రోజులు ఎదురు చూడాల్సిందే.English summary
Jagapathi Babu's Patel SIR Directed by debutante Vasu Parimi and produced by Sai Korrapati under Vaarahi Chalana Chitram, the first look poster released today.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu