twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    దేశభక్తిని గుర్తుచేస్తున్నసినీ రంగుల ప్రపంచం

    By Bojja Kumar
    |

    ఎందరో మహానుభావుల త్యాగాల, పోరాటాల ఫలితమే...65 ఏళ్ల కిందట మన దేశానికి ప్రాప్తించిన స్వాతంత్ర్యం. దాదాపు నాలుగు వందల ఏళ్ల పాటు వలస బ్రిటిష్ పాలకులు సాగించిన నియంతృత్వ పాలన నుంచి మనకు స్వేచ్ఛ లభించింది. ఈ క్రమంలో ఎంతో మంది తూటాలకు ఎదురొడ్డారు...మరెంతో మంది ధన, మాన, ప్రాణాలను కోల్పోయారు. ఈరోజు మనం ఇంత స్వేచ్ఛగా..జీవిస్తున్నామంటే వారి పుణ్యమే.

    మరి మన పూర్వీకుల త్యాగాలను ఇప్పడు మనం కళ్లకు కట్టినట్లు వీక్షిస్తున్నామంటే సీని రంగుల ప్రపంచమే కారణం. అప్పట్లో వచ్చిన కాలపాణి, అల్లూరి సీతారామారాజు, భగత్ సింగ్, మంగళ్ పాండే లాంటి అనేక సినిమాలు అలనాటి పోరాటాలకు అద్దం పట్టేవిగా ఉంటే....ఇటీవల కాలంలో వచ్చిన ఖడ్గం, భారతీయుడు లాంటి మరికొన్ని సినిమాలు మనం మరిచి పోతున్న దేశ భక్తిని, మన బాధ్యతలను గుర్తు చేస్తూ మనలో స్ఫూర్తిని రగిలిస్తూ వస్తున్నాయి.

    స్వాతంత్ర్యం తర్వాత పేదరికం, ఆకలి, హింస, కుల, మత విద్వేషాలు లేని దేశంలో ఉంటామని అంతా ఆశించారు.కానీ మనకు స్వాతంత్ర్యం వచ్చి ఇన్నేళ్లయినా అలాంటి పరిస్థితులు మనదేశంలో ఇంకా నెలకొని ఉన్నాయి. సమానత్వం, మానవత్వం అని మన రాజ్యాంగంలో రాసుకున్నా అవి రాతలకే పరిమితం అయ్యాయి. ఇలాంటి అంశాలకు కూడా తమ సినిమాల ద్వారా పదును పెడుతూ దేశ ప్రజలు నిర్వర్తించాల్సిన బాధ్యతలను గుర్తు చేస్తున్నారు కొందరు దర్శకులు, కథానాయకులు. ఇలాంటి మంచి సినిమాలు మరెన్నో రావాలని ఆశిస్తూ...దేశభక్తిని తమ సినిమాల ద్వారా చాటిచెబుతున్న దర్శకులు, నటులకు హాట్సాఫ్ చెబుదాం.

    English summary
    Various patroitic films were produced in Telugu and other languages, like Alluri Seetaramaraju
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X