twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వారసత్వ హీరోలపై పవన్‌కళ్యాన్ చురక

    By Srikanya
    |

    ''వారసత్వాన్ని నమ్ముకోలేదు. అలా వచ్చేవి నాకు అవసరం లేదు.వారసత్వంగా వచ్చే విద్య కంటే... స్వశక్తినే నేను నమ్ముతాను. అందుకోసం ఎంత కష్టానికైనా నేను సిద్ధం.నా సినిమా అంటే నన్ను చూడ్డానికి వస్తున్నారా? లేదంటే అన్నయ్య మీద అభిమానంతో వస్తున్నారా? అనే అనుమానం ఉండేది.అన్నయ్య 'నటిస్తావా" అని అడిగినప్పుడు 'చిరంజీవి తమ్ముడ్ని అయినంత మాత్రాన ప్రజలు నన్నెందుకు చూడాలి అని నాకు నేను ప్రశ్నించుకున్నాను.'తొలిప్రేమ" దాకా ఈ కన్‌ఫ్యూజన్ నాలో ఉంది"" అంటూ పవన్ కళ్యాణ్ పంజా ఆడియో పంక్షన్ లో నిన్న(శనివారం)అన్నారు.ఈ విషయం కావాలని అన్నారో ..క్యాజువల్ గా అన్నారో కానీ,వారసత్వ హీరోల్లో చాలా మందికి సూటిగా తగిలినట్లైంది.దీనిపై వారసత్వ హీరోల క్యాంపుల్లో చర్చలు మొదలయ్యాయి.ముఖ్యంతా తెలుగులో వారసత్వ హీరోలు ఎక్కువ మందే ఉన్నారు.అంతెందుకు పవన్ సోదరుడు మెగాస్ట్రార్ చిరంజీవి కుమారుడు రామ్ చరణ్ కూడా వారసత్వ హీరోనే.ఈ మాటలతో అయినా వారసత్వ హీరోలు వాళ్ళని వాళ్లు పవన్ కళ్యాణ్ లా ప్రశ్నించుకుని వారసత్వ ముద్ర నుంచి బయిటకు వస్తే బెస్ట్ అని అభిమానులు ఆశిస్తున్నారు.పవన్ హీరోగా విష్ణువర్థన్ దర్శకత్వంలో నీలిమ తిరుమలశెట్టి, శోభు యార్లగడ్డ, నగేష్ ముంత, వెంకట్ దేవినేని కలిసి నిర్మిస్తున్న చిత్రం 'పంజా".పవన్‌శంకర్‌రాజా సంగీతం సమకూర్చిన ఈ చిత్రం పాటల విడుదల శనివారం రాత్రి హైదరాబాద్‌లో జరిగింది.ఈ సందర్భంగా పవన్‌కళ్యాణ్ పై విధంగా స్పందించారు. ఎస్.ఎస్.రాజమౌళి ఆడియో సీడీని ఆవిష్కరించి పవన్‌కళ్యాణ్‌కి అందించారు. 'పంజా" 2జీబీ మెమరీ కార్డ్‌ని పవన్‌కళ్యాణ్ విడుదల చేశారు.

    English summary
    Pawan Kalyan's Panja film audio launched at the Gachibowli Indoor Stadium in a massive and grand way.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X