»   » ప్రదీప్-పావని పెళ్లి వీడియో : ఆత్మహత్య ఘటనతో ఫ్యాన్స్ కన్నీరు...

ప్రదీప్-పావని పెళ్లి వీడియో : ఆత్మహత్య ఘటనతో ఫ్యాన్స్ కన్నీరు...

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: టీవీ నటుడు ప్రదీప్ ఆత్మహత్య సంఘటన తెలిసి పలువురు బుల్లితెర అభిమానులు, సన్నిహితులు శోక సముద్రంలో మునిగిపోయారు. క్షణికావేశంలో ప్రదీప్ ఇంత కఠినమైన నిర్ణయం తీసుకోవడం అందరినీ బాధించింది.

ఆగస్టు 21, 2016లో ప్రదీప్, పావని రెడ్డి వివాహం జరిగింది. వీరిది ప్రేమ వివాహం. పట్టుమని పది నెలలు కూడా గడవక ముందే ఇలాంటి విషాదం చోటు చేసుకోవడాన్ని బుల్లితెర ప్రేక్షకలు జీర్ణించుకోలేక పోతున్నారు.

ఇంటర్నెట్ లో పెళ్లి వీడియో వైరల్

ప్రదీప్ ఆత్మహత్య సంఘటన తర్వాత.... ఆయన ఎవరు? ఆయన భార్య ఎవరు? అనే అంశాలపై నెటిజన్లు సెర్చ్ చేయడం మొదలు పెట్టారు. ఈక్రమంలో గతేడాది ఆగస్టులో జరిగిన వీరి పెళ్లికి సంబంధించిన వీడియో వైరల్ అయింది.

క్షణికావేశమే...

క్షణికావేశమే...

ప్రేమికులైనా, భార్య భర్తలైనా తమ రిలేషన్ షిప్ లో చిన్న చిన్న మనస్పర్థలు మామూలు. అయితే కొన్ని సందర్భాల్లో ఈ చిన్న చిన్న గొడవల వల్ల క్షణికావేశానికి గురై ఆతహత్యలకు పాల్పడటం లాంటివి చోటు చేసుకుంటున్నాయి. ప్రదీప్ ఆత్మహత్య కూడా అలాంటి దే అంటున్నారు ప్రముఖ నటి కవిత.

విషాదంలో పావని

విషాదంలో పావని

తాను ప్రేమించిన వాడు, భర్తగా ఏరి కోరి కట్టకున్నవాడు శవమై తేలడంతో పావని శోక సముద్రంలో మునిగి పోయింది. ప్రదీప్ ఇలా చేసుకుంటాడని అస్సలు ఊహించలేదని, షాకయ్యానని పావని మీడియాతో వాపోయారు.

ఎటూ తేల్చని పోలీసులు

ఎటూ తేల్చని పోలీసులు

ప్రదీప్ ఆత్మహత్య ఘటనపై పోలీసులు ఇంకా ఏ విషయం తేల్చలేదు. పావని వాదన ఎలా ఉన్నా నిజా నిజాలు లేల్చేందుకు వారు తమదైన పద్దతిలో ముందుకు సాగుతున్నారు. పోస్టు మార్టం నివేదిక వచ్చిన తర్వాత ఏ విషయం తేల్చనున్నారు.

English summary
After Pradeep suicide incident... PAVANI- PRADEEP wedding video goes viral. Popular TV actor Pradeep Kumar has committed suicide in the early hours of Wednesday in Hyderabad. According to the reports, the actor hanged himself at his residence in Puppalaguda at 4 in the morning.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu