twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నా నిర్మాతలకు చేతకాకే..పవన్ చురకలు

    By Srikanya
    |

    మనం మంచి సినిమాలు తీసి తమిళంలో డబ్బింగ్ చేసి విడుదల చేస్తే చూస్తారు. అయితే మనవాళ్లు ఒక దెబ్బ తింటే అక్కడ ఆగిపోతారు. మణిరత్నం గారు చిత్రం పల్లవి అనుపల్లవి ఆడలేదు..కానీ ఆయన సినిమాలు తెలుగులో డబ్బింగ్ చేయటం మానలేదు. మన నిర్మాతలకు చేతకాకే డబ్బింగ్ సినిమాలు ఆపు చేయాలని పట్టుపడుతున్నారని పవన్ కళ్యాణ్ కామెంట్ చేసారు. ఆయన పంజా ప్రమోషన్ లో భాగంగా ఇచ్చిన ఇంటర్వూలో ఈ విషయాలు చర్చించారు. అలాగే ..మంచి ఎగ్జాంపుల్ ఏమిటంటే.. మగధీర లాంటి సినిమా అక్కడ మొదట వచ్చి ఉంటే మన మీద రుద్ది రుద్ది పెట్టేవారు. కారణాలు ఏమిటో తెలియవు కానీ మనవాళ్లకు ఎగ్రిసెవ్ మార్కెటింగ్ ఎబిలిటీ లేదు. మనకి చేత కాక వాళ్లని అనటం తప్పు అనిపిస్తుంది. మనకి ప్రొడక్టు ఉన్నప్పుడు మనం ప్రమోట్ చెయ్యలేం. వాళ్లకు ఉన్నప్పుడు వాళ్లు చేసుకుంటున్నారు.

    తమిళ సినిమాలకీ బడ్జెట్ పెరుగుతున్నాయి అందుకే వాళ్లు మార్కెట్ పెంచుకుంటున్నారు. అప్పుడప్పూడూ ఈ విషయాలు టీవీల్లో చూస్తూంటాను. సినిమా అనేది క్రియేటివ్ ఎబిలిటికి సంభందించింది. దాన్ని భాషకు, ప్రాంతానికి ముడి పెట్టకూడదు. మొన్న డబ్బింగ్ సినిమాలు బ్యాన్ కి చెందిన మీటింగ్ చూసాను..తమిళ సినిమాలు బ్యాన్ చేసేయాలి అంటున్నారు. మన వాళ్లు మంచి సినిమా తీస్తే దాన్ని బయిట ప్రమోట్ చేయటానికి ప్రయత్నించరు..రీమేక్ రైట్స్ ఎక్కువ వస్తాయని అమ్ముకోవాటనికే చూస్తారు. కొత్తగా మార్కెటింగ్ క్రియేట్ చేసుకోవాలి అనుకోరు. ఉన్నదాంతో సరిపోతుందిలే అనుకుంటున్నారు.మనకి వీలుంటే ఫైట్ చెయ్యాలి. అంతేగానీ బ్యాన్ చెయ్యాలి అనటం చేతకాని తనమే అంటాను అని నిర్మాతలకు ఆయన చురకలు అంటించారు.

    English summary
    I hope Panja would be liked by my fans. We have put in sincere efforts to make a good film and I hope it would be received well,” Pawan Kalyan said.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X