పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా మరో ఆడియో లాంచ్

By Srikanya

హైదరాబాద్ : పవన్ కళ్యాణ్ రీసెంట్ గా రేయ్ చిత్రం ఆడియో పంక్షన్ కి హాజరయ్యారు. అలాగే అలీ హీరోగా రూపొందిన అలీ బాబా ...ఒక్కడే దొంగ చిత్రం ఆడియో విడుదల ఆయన చేతుల మీదుగా జరగనుందని చెప్తున్నారు. ఈ మేరకు దర్శక,నిర్మాతలు పోస్టర్స్ విడుదల చేసారు. పవన్ ఈ ఆడియో విడుదల చేసి,బెస్ట్ విషెష్ చెప్పారని తెలుస్తోంది.

Pawan Attended Ali’s Audio Launch

అలీ హీరోగా కమల్ సినీ క్రియేషన్స్ పతాకంపై ఫణిప్రకాష్ దర్శకత్వంలో బొడ్డెడ శివాజీ రూపొందిస్తున్న చిత్రం 'అలీ బాబా ఒక్కడే దొంగ'. ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. నిర్మాత శివాజీ మాట్లాడుతూ పిభ్రవరి 14న చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని, ఈ సినిమాకు అల్లరి నరేష్ వాయిస్ వోవర్ ఇవ్వడం విశేషమని తెలిపారు.

సినిమా మొదటినుండి చివరి వరకు ఆసక్తికరంగా, తమాషాగా సాగుతుందని, కామెడీ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రంలో అన్ని పాత్రలు వినోదాన్ని అందిస్తాయని దర్శకుడు ఫణిప్రకాష్ తెలిపారు. పోలీస్ అవుదామని దొంగగా మారిన యువకుని కథే ఈ చిత్రమని, త్వరలో పాటల విడుదల కార్యక్రమం జరుపుతామని ఆయన అన్నారు. తణికెళ్ల భరణి, జీవా,షఫీ, రఘుబాబు, దువ్వాసి మోహన్, రాంజగన్, కొండవలస, దాసన్న,రామరాజు, చంద్రశేఖర్, పృధ్వీ తదితరులు నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సాయి శ్రీకాంత్, కెమెరా: జాన్, కో డైరక్టర్: ఎన్ అనీల్ కుమార్, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: సాయిబాబు వాసిరెడ్డి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X