»   » పవన్ డైరక్షన్ తో అప్పుడు ఖుషి - ఇప్పుడు పులి!

పవన్ డైరక్షన్ తో అప్పుడు ఖుషి - ఇప్పుడు పులి!

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ 'కొమరం పులి" చిత్రాన్ని 'ఖుషి" డైరక్టర్ ఎస్ జె సూర్య రూపొందిస్తున్నాడనే విన్నాం ఆయన దర్శకత్వం అయిపోయింది. ఇప్పుడు ఆ చిత్రానికి దర్శకుడుగా పవన్ కళ్యాణ్ మారాడు. కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంది కదా? ఎస్ జె సూర్య తను అనుకున్న విధంగా చిత్రాన్ని పూర్తి చేసి చూపించాడు.

ఆయన చేసిన కొన్ని సీన్స్ పవన్ కళ్యాణ్ కి నచ్చకపోవడంతో తను అనుకున్న విధంగా ఆ సీన్స్ ని షూట్ చేస్తున్నారు. ఈ రీ షూట్స్ తో చిత్రం విడుదల మరింత జాప్యం కానుందని సమాచారం. గతంలో 'ఖుషి" చిత్రంలో ఫైట్స్ కి పవన్ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే..ఆ చిత్రం ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే.

అందుకే ఈ చిత్రంలో కూడా పవన్ ని ఇన్ వాల్వ్ చేయాలని దర్శకుడు ఎస్.జె సూర్య అనుకుంటున్నాడట.అనుకున్నదే తరువుగా పవన్ కి నచ్చని వాటిని అతని దర్శకత్వంలో షూట్ చేయడానికి రెడీ అయ్యాడట. సూర్య అయితే ఈ సారి పవన్ దర్శకత్వం చేస్తున్నది. ఫైట్స్ మాత్రం కాదని చిత్రంలోని కొన్ని కొన్ని పార్ట్ లని విశ్వషనీయ వర్గాల సమాచారం.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu